మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల తరువాత భార్య ఉపాసనతో కలిసి చెర్రీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. భార్య కోసం కొద్దిగా సమయం కేటాయించడానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరి వెకేషన్ కి చెక్కేశాడు. అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు చరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి రామ్ చరణ్ ఫిన్లాండ్ మంచు పర్వతాలపై ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక పూర్తిగా కొత్త లుక్ లో చరణ్ కనిపించడం అభిమానులకు సర్ ప్రైజింగ్ గా కనిపిస్తోంది. మొన్నటివరకు రామరాజు గెటప్ లో ఉన్న చెర్రీ.. ఇక ఇటీవలే శంకర్ సినిమా కోసం గెటప్ మార్చిన ఈ హీరో ప్రస్తుతం భార్య పక్కన మరో కొత్త యాంగిల్ లో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ ట్రిప్ ని ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న చెర్రీ.. ఆ తర్వాత తిరిగి షూటింగ్ ని మొదలుపెట్టనున్నాడు.