నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 4 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ ప్రోగ్రాం తాజగా 5వ ఎపిసోడ్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడూ కీరవాణీ లతో బాలయ్య 5 వ ఎపిసోడ్ ఈ శుక్రవాదం స్ట్రీమింగ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ ప్రోగ్రాంలో బాలయ్య, రాజమౌళి, కీరవాణీలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలను రాబట్టారు.
ఇంట్లో అందరు కూర్చొని భోజనం చేసేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటారు అని బాలయ్య అడుగగా.. రాజమౌళి సినిమాల గురించే.. ఎక్కువ హీరోల గురించి గాసిప్స్ చేసుకొంటాము అని చెప్పడంతో .. ఏ హీరో గురించి మాట్లాడుకొంటారని బాలయ్య అడగగా .. జక్కన్న అది చెప్పడం కుదరదని చెప్పాడు. అయినా బాలయ్య జక్కన్నను వదలకుండా పర్లేదు చెప్పండి.. చరణ్ , తారక్, నా గురించి కూడానా అని అనగా.. ఒకరని ఏమి లేదు.. చిరంజీవి, మోహన్ బాబు, మీ గురించి కూడా గాసిప్స్ మాట్లాడుకొంటామని నవ్వేశాడు. అయితే బాలయ్య ఎంత అడిగినా ఆ గాసిప్ ఏంటి అనేది మాత్రం జక్కన్న బయటపెట్టలేదు. ఫన్ ఫుల్ గా సాగిన ఈ ఎపిసోడ్ లో జక్కన్న పడ్డ కష్టాలు, ఇక్కడివరకు ఎదిగిన విధానం అన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ గా మారింది.