నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో స్టాప్ అనేదే లేకుండా ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. తాజాగా ఆహా రిలీజ్ చేసిన ఫోటోలను బట్టి చూస్తుంటే త్వరలో ప్రేక్షకులకు బిగ్గెస్ట్ ట్రీట్ ఉండబోతోందని అర్థమవుతోంది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ బిగ్గెస్ట్ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే… దర్శక దిగ్గజం రాజమౌళి, కీరవాణి. వీరిద్దరూ బాలయ్యతో కలిసి ‘అన్‌స్టాపబుల్’ షోలో ఫన్ అండ్ ప్రమోషన్స్ జరపనున్నారు. “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే” ఎపిసోడ్ 5లో రాజమౌళి, కీరవాణి కలిసి బాలయ్యతో సందడి చేయబోతున్నారు. త్వరలో ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కానుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్ డిసెంబర్ 17న ఆహాలో ప్రీమియర్ కానుంది.
Read Also : అంత ధైర్యం ఎవరికి ఉంది… నేను రెడీ !
రాజమౌళి, కీరవాణి ఈ టాక్ షోలో పాల్గొనడం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్‌లలో ఒక భాగం. జనవరి 7న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళి అండ్ టీం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్‌కి అన్ని చోట్ల నుంచి విశేష స్పందన వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న టీమ్ వివిధ భాషల్లో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ట్రైలర్ లాంచ్‌తో పాటు కన్నడ, తెలుగు, హిందీ, తమిళ మీడియాతో టీమ్ ఇంటరాక్ట్ అయ్యింది. మరోవైపు బాలకృష్ణ “అఖండ” విజయాన్ని ఎంజాయ్ చేస్తూ “అన్‌స్టాపబుల్” షూటింగ్ చేస్తున్నారు. ఆయన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది.