పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో అంచనాల మధ్య మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్ల పరంగా కొద్దిగా బెటర్ అనిపించుకున్న ఈ సినిమా పడిజిటల్ ప్రీమియర్ గా రానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన సంగతి విదితమే.
ఇక ఉగాది కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. అయితే రాధేశ్యామ్ విడుదల అయ్యి కనీసం నాలుగు వారాలు కూడా కాలేదు. అప్పుడే ఈ సినిమాను ఓటిటీ లో రిలీజ్ చేయడమేంటనీ అభిమానులు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు లో మాత్రమే కాకుండా, మిగతా భాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఓటిటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Hop on this magical journey of love with #RadheShyamOnPrime, April 1
— prime video IN (@PrimeVideoIN) March 28, 2022
#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @GopiKrishnaMvs @TSeries pic.twitter.com/D7ZcDFfS7y