పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో అంచనాల మధ్య మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్ల పరంగా కొద్దిగా బెటర్ అనిపించుకున్న ఈ సినిమా పడిజిటల్ ప్రీమియర్ గా రానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఇక ఉగాది…
ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ ఈనెల 11న విడుదల కానుంది. మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ క్లాస్ టచ్ తో ‘రాధే శ్యామ్’ చేయటం నిజంగా రిస్క్ అనే అనుకోవాలి. గతంలో కూడా తెలుగులో పలు ప్రేమ కథా చిత్రాలు చేశాడు ప్రభాస్. ‘వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటివి ఆ కోవకే చెందుతాయి. అయితే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రేమకథా చిత్రం చేయటం మాత్రం ముమ్మాటికి హై రిస్క్ అనే అనుకోవాలి.…
రాధేశ్యామ్.. ప్రభాస్.. పూజా హెగ్డే.. థమన్.. యూవీ క్రియేషన్స్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకొని మార్చి 11 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు అంటూ ప్రభాస్, పూజ హెగ్డే క్షణం కూడా బిజీగా లేకుండా కష్టపడుతున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో…
రాధేశ్యామ్ ప్రమోషన్స్ జోరందుకున్నాయి.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాధేశ్యామ్ సాగా పేరుతో రిలీజ్…
ప్రేమ పావురాలు సినిమా వచ్చి ఎన్ని ఏళ్ళైనా భాగ్యశ్రీ నవ్వు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. తెలుగులో ఆమె తీసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగు అభిమానుల్లో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక పెళ్లి తర్వాత భాగ్య శ్రీ సినిమాలకు దూరమయ్యారు. కటుంబ జీవితానికే సమయం కేటాయించి ఆ లైఫ్ లో బిజీ అయ్యారు. సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ వెటరన్ నటి రాధేశ్యామ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11 న విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా మరింత క్రేజ్ ని…
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఒకటి. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో.. అప్పటినుంచి ఈ సినిమా విడుదలకు అడ్డంకుల మీద అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి పక్కా అని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టగా అంతలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో మరోసారి వాయిదా పడింది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే అందుకుంటున్న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. అన్ని బావుంటే ఈపాటికే రాధేశ్యామ్ ప్రమోషన్స్ మొదలైపోయేయి. కానీ, కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమపై మరోసారి దెబ్బ వేసింది. దీంతో ఈ సంక్రాంతి రేసు నుంచి రాధేశ్యామ్ తప్పుకొంది. మరో మంచి రోజు చూసి ఈ సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే ఫ్యాన్స్ ని నిరాశపడకుండా డైరెక్టర్ రాధా నిత్యం ఏదో ఒక…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు ఒమిక్రాన్ దెబ్బకు వాయిదా దారి పట్టాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించగా .. ఇక అందరి చూపు ‘రాధేశ్యామ్’ పై పడింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ‘రాధేశ్యామ్’ మాత్రం జనవరి 14 న విడుదల ఖాయమంటూ మేకర్స్ బల్లగుద్ది చెప్తున్నా.. అభిమానుల మనస్సులో మాత్రం వాయిదా పడింది అనే అనుమానం…
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. విడుదల తేదీని దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.…