Puri Jagannadh in Search on New heorine for Ram Movie: హీరోయిజంకి కొత్త మేనరిజం నేర్పిన పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోయిన్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కథానాయికలు ని పరిచయం చేశారు పూరి. ఇప్పుడు అయన రామ్ పోతినేనితో చేయబోతున్న సినిమా కోసం కూడా ఒక కొత్త భామను వెతికే పనిలో పడ్డారు. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత కొంత కాలం లో ప్రొఫైల్ మైంటైన్ చేసిన ఆయన ఈమధ్యనే రామ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ప్రస్తుతం సినిమా షూట్ కూడా ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ ను తీసుకునే పూరీ పరిచయం చేసిన హీరోయిన్ల లిస్టు 22కి చేరుతుంది. అన్నట్టు ఆ 21 మందిని కూడా ఒకసారి చూసేయండి.
1. అమీషా పటేల్ – బద్రి
2. రేణు దేశాయ్ – బద్రి
3. అనుష్క శెట్టి – సూపర్
4. హన్సిక మోత్వానీ – దేశముదురు
5. రక్షిత – ఇడియట్
6. అసిన్ – అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి
7. ఆయేషా టాకియా – సూపర్
8. నేహా శర్మ – చిరుత
9. అదా శర్మ – హార్ట్ ఎటాక్
10. అదితి ఆర్య – ఇజం
11. కంగనా రనౌత్ – ఏక్ నిరంజన్
12. ముస్కాన్ సేథి – పైసా వసూల్
13. తను రాయ్ – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
14. సమ్రీన్ – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
15. సమీక్ష – 143
16. సియా – నేనింతే
17. దిషా పటాని – లోఫర్
18. కేథరీన్ ట్రెసా – ఇద్దరమ్మాయిలతో
19. అనన్య పాండే – లైగర్ మూవీ
20. మన్నారా చోప్రా – రోగ్
21. నేహా శెట్టి – మెహబూబా