Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నోట్లో చుట్ట పెట్టుకున్న లుక్ మీద కొంచెం నెగెటివిటీ కనిపించింది. పుష్ప పోస్టర్ ను పోలినట్టు ఉందనే టాక్ వచ్చింది. దీంతో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని బుచ్చిబాబు డిసైడ్ అయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమికి పెద్ది ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
Read Also : SRH Ugadi Wishes: తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌ఆర్‌హెచ్ టీం.. వీడియో వైరల్
ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గాల్లో ఎగురుతున్నాడు. చుట్టూ వందలాది మంది జనాలు ఉన్నారు. వారంతా ఎర్ర జెండాలు పట్టుకుని కనిపిస్తున్నారు. ఆ గుంపు మధ్యలో రామ్ చరణ్ గాల్లో ఎగిరిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తీస్తున్నట్టు సమాచారం. గుర్తింపు కోసం జరిగే పోరాటం దీని బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తోంది. ఇక ఫస్ట్ గ్లింప్స్ ను ఉగాదికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సౌండ్ మిక్సింగ్ ఆలస్యం కావడంతో శ్రీరామనవమికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఫస్ట్ గ్లింప్ స్ తో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో చూడాలి.