Priyanka Chopra: ఆమె ఒక నటి.. గ్లోబల్ బ్యూటీ.. అమెరికా కోడలు.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ.. ఇన్ని చెప్పాక ఆమె ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. ప్రియాంక ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని హిట్స్ అందుకుంది అనేది అందరికి తెల్సిందే. ఇక తనకన్నా చిన్నవాడైన నిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అమెరికా కోడలుగా మారిన ఆమె.. హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా మెరుస్తుంది. ఇక ప్రియాంక- నిక్ కు మాల్దీ అనే కూతురు ఉన్న విషయం కూడా తెల్సిందే. ఈ చిన్నారి పుట్టినప్పుటి నుంచి ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారింది. ఆమె పుట్టినప్పటి నుంచి ప్రియాంక.. మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తూ వస్తుంది. ఇక ఎక్కడకు వెళ్లినా మన మూలాలను మర్చిపోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రియాంక కూడా అదే చేస్తుంది.
ఇక ఈ ఏడాది జనవరి 22 న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భక్తుల కోసం గుడి తలుపులు తెరిచిన నాటి నుంచి చాలా మంది ప్రముఖులు కుటుంబ సమేతంగా బాలక్ రామ్ ను దర్శించుకున్నారు. ఇక నిన్న ప్రియాంక చోప్రా కుటుంబం కూడా రాములవారిని దర్శనం చేసుకుంది. ఇదంతా సాధారణమే కానీ, హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మాల్తీకి నుదుటన బొట్టు పెట్టి తీసుకొచ్చింది. నుదుటున బొట్టుతో చిన్నారి ఎంతో అందంగా ఉంది. ఇక నిక్ జోనాస్ కూడా సంప్రదాయబద్ధంగా అన్ని పూజలను నిర్వహించాడు. ప్రియాంక తన ప్రేమతో అతడిని మార్చేసిందని చెప్పాలి. ఇక ఈ గ్లోబల్ బ్యూటీ సైతం చీరకట్టులో మెరిసింది ఏ దేశం ఎగినా.. సాంప్రదాయ మూలలను మరువకుండా ఈ కుటుంబం హిందూ సాంప్రదాయాలను గౌరవించడం చాలా బావుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కేశావ్ ప్రియాంక.. ఆ పని చేసి వారి గుండెల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అంతే.. అంటూ చెప్పుకొస్తున్నారు.
Best video on the internet today !
Priyanka Chopra & Nick Jonas with their daughter at Ayodhya Ram mandir
Jai shree Ram 🚩 pic.twitter.com/HJdPZgLv4U
— Babumoshai (@TeraKabil) March 20, 2024