Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న మూవీలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఏపీలో, ఆ తర్వాత ఒడిశాలో షూటింగ్ చేశారు. ఒడిశాలో షూటింగ్ షెడ్యూలో నిన్నటితో అయిపోయింది. దాంతో ప్రియాంక న్యూయార్క్ వెళ్లిపోయింది. ఆమె వెళ్తూ ఓ పోస్టు చేసింది. ప్రత్యేకించి ఓ మహిళ గురించి ప్రియాంక చొప్రా చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వెళ్తున్నప్పుడు జామపళ్లు అమ్మే మహిళను చూశానని చెప్పింది.
read also : Supreme Court: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
‘నాకు జమాపళ్లు అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గరకు వెళ్లి కేజీ జామపళ్లు ఎంత అని అడిగాను. ఆమె రూ.150 అని చెప్పింది. నేను ఆమెకు రూ.200 ఇచ్చాను ఆమె చిల్లర కోసం వెతుకుంతే నేను వద్దని చెప్పాను. ఆ రూ.50 ఉంచుకోమని చెప్పి అక్కడి నుంచి కొంచెం పక్కకు వెళ్లాను. కానీ ఆ మహిళ నా సాయం తీసుకోలేదు. నా దగ్గరకు వచ్చి ఆ ఇంకొన్ని జామపళ్లు ఇచ్చి వెళ్లిపోయింది. ఆమె నిజంగా నా మనసు గెలిచింది. పని చేసే మహిళ ఒకరిపై ఆధారపడదు. ఆత్మగౌరవంతో బతుకుతుంది. ఆమెను చూసి నాకు ఇన్ స్పిరేషన్ గా అనిపించింది’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ఆ జామపళ్ల ఫొటోలను కూడా ఆమె పంచుకుంది. ఆమె చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.