Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అమెరికా కోడలుగా మారిన ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలపైనే కన్నువేస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే బాలీవుడ్ లో మెరుస్తోంది. ఇక అమ్మడి కెరీర్ గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా భర్త నిక్ జోనస్ తో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇటీవలే సరోగసి ద్వారా ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా మారిన ఈ జంట పేరెంట్స్ గా కూడా కొన్ని బాధ్యతలను మోస్తున్నారు. ఇక నిక్ తో ప్రియాంక ప్రేమలో పడినప్పటి నుంచి పెళ్లి చేసుకొనేవరకు ప్రతి ఒక్కరు ఆమెను విమర్శించినవారే.. ఎందుకంటే.. నిక్ కన్నా ప్రియాంక పదేళ్లు పెద్దది. ఆ ఏజ్ లో నిక్ ను పెళ్లి చేసుకొంటుంది అంటే డబ్బు కోసమే అని, జీవితాంతం మిలియనీర్ గా సెటిల్ అయిపోవచ్చనే ఉద్దేశ్యంతోనే ప్రియాంక, నిక్ ను వివాహమాడిందని చెప్పుకొచ్చారు. కాగా, ప్రియాంక తన రేంజ్ ను చూపించింది.
భర్తకు భారీ బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చి ఔరా అనిపించింది. నిన్నటితో నిక్ 30 వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ పుట్టినరోజును అతడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది ప్రియాంక. భర్త కోసం ఒక ప్రైవేట్ జెట్ ను బుక్ చేసి అందులో బర్త్ డే పార్టీని ప్లాన్ చేసింది. ఇక నిక్ ఈ సర్ ప్రైజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇలా ప్రైవేట్ జెట్ ఆకాశంలో ఎగిరడంతో అక్కడ నిక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది గ్లోబల్ బ్యూటీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది ప్రియాంక రేంజ్ అంటే.. అని ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.