I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది

Mollywood

Mollywood

మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ హీరోగా నిషామ్ బాషిర్ దర్శకత్వంలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘INobody’. తాజాగా ఈ సినిమాను విడుదల చేశారు మేకర్స్. టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. ఒక తండ్రి తన బిడ్డను నిద్రపుచ్చడానికి బెడ్‌టైమ్ స్టోరీ చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అయితే అక్కడ అందరూ ఊహించే రాజులు, రాణుల కథకు బదులుగా.. ఆ తండ్రి ఒక సంక్లిష్టమైన బ్యాంక్ దోపిడీ ఎలా జరిగిందో తన బిడ్డకు వివరించడం టీజర్‌లోనే హైలైట్‌గా నిలిచింది. ఈ విభిన్నమైన ఓపెనింగ్ సీన్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి  సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఇచ్చిన నేపధ్యసంగీతం చాలా బాగుంది. టీజర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది.

×
×
Ad