Moksagna: మోక్షజ్ఞ మూవీలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moksagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించాడు. మాస్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ముందుకు సాగిన బాలయ్య, మొదటి నుంచి కమర్షియల్ సినిమాల వైపే ఎక్కువగా అడుగులు వేశాడు. కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి, సక్సెస్‌లను సాధించిన ఘనత కూడా బాలయ్యకే దక్కుతుంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సైతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఉంటుందంటూ వార్తలు వచ్చినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు.
వశిష్ట డైరెక్షన్లో సినిమా చేస్తున్న మోక్షజ్ఞ, ఈ సినిమా మీద తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మోక్షజ్ఞ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందని, దాన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు వశిష్ట భావిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబుతో సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కనుక మోక్షజ్ఞ సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమాకి భారీ క్రేజ్ పెరుగుతుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే టాప్ హీరోగా మారే అవకాశాలు కూడా ఉంటాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read
గత కొద్ది రోజులుగా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలైతే లేవు. ఫ్యామిలీలో వచ్చిన విభేదాల కారణంగానే వాళ్ళు దూరంగా ఉంటున్నారు అంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా అవకాశం వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా ఒకరి కోసం మరొకరం నిలబడతాం అంటూ పలు సందర్భాల్లో అటు బాలయ్య, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే హరికృష్ణ చనిపోయినప్పుడు బాలయ్య ఫ్యామిలీ పెద్దగా వ్యవహరించాడు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లకు ధైర్యాన్నిచ్చాడు. ఆ సమయంలో బాలయ్యకి ప్రశంసలు దక్కాయి.
బాలయ్య తన తర్వాత లెగసీని కంటిన్యూ చేయడానికి మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కనుక మోక్షజ్ఞ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తే మాత్రం సినిమా మీద భారీ బజ్ ఏర్పడుతుంది. దానికి తోడుగా నందమూరి అభిమానులతో పాటు ఇండియన్ సినిమా ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం ఉంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా మీద పూర్తి ఫోకస్‌ని పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చేయబోతున్నాడు. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తానికైతే ‘డ్రాగన్’ సినిమాతో పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేయాలనే ప్రయత్నంలో ఎన్టీఆర్ ఉన్నాడు. అయితే ఆయన ఈ సినిమాలో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Moksagna: మోక్షజ్ఞ మూవీలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?
-
Tollywood: మాస్ హీరోలుగా మారడం కాదు.. ఆ హీరోలను చూసి నేర్చుకోండి..!
-
Idupu Kayitham Song: ‘ఇడుపు కాయితం’ నుంచి మరో క్రేజీ సాంగ్..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
Delimitation Bill: డీలిమిటేషన్ బీజేపీ రాజకీయ కుట్ర.. ఏపీకి 25 ఎంపీ సీట్ల నష్టం..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!