OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
- మంచిర్యాల కాంగ్రెస్‌లో ఓ రేంజ్లో నడిచిన వర్గపోరు..
- ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మంత్రి వివేక్ గ్రూప్స్ వార్..
- స్టేట్ డిస్కషన్‌గా మారిన మంచిర్యాల రౌడీ రాజకీయం..
- స్వయంగా డీజీపీ జోక్యంతో కదిలిన లోకల్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడి రౌడీ రాజకీయాలకు బ్రేక్ పడ్డట్టేనా..? హస్తం పార్టీలో వర్గ విభేదాలకు పుల్ స్టాప్ పడిందా..? అధిష్టానం జోక్యంతో ఆ నేతలు వెనక్కి తగ్గారా..? మంచిర్యాల కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఒకవైపు రౌడీల నగర బహిష్కరణ, మరో వైపు అధిష్టానం సీరియస్ కావడం లోకల్ కాంగ్రెస్‌లో మార్పు తెచ్చిందా? మార్పు శాశ్వతమేనా…? లేక అరాచకం పార్ట్ టూ ఉంటుందా?
మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు ఓ రేంజ్లో నడిచింది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అనుచరులు, మంత్రి వివేక్, ఎంపీ వంశీ అనుచరులకు మధ్య గొడవలు ముదిరి దాడులు సైతం జరిగాయి. సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం సాగింది. అది కాస్తా శృతిమించి భౌతిక దాడుల వరకు వెళ్ళింది. ఇరు వర్గాల క్యాడర్ మధ్య ఘర్షణలు నిత్యకృత్యమైపోయి…చివరికి బతుకమ్మ, దసరా వేడుకల్ని సైతం అందుకు వేదికలుగా మార్చుకున్నారు. అప్పట్లో తాళ్లపేటలో జరిగిన గొడవ కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, పోలీసులు ఓ వర్గానికి చెందిన ఆరుగురిని అరెస్టు చేసి గ్రామంలో నిషేధాజ్ఞలు విధించే వరకూ పరిస్థితి వెళ్లింది.
Also Read
సాధారణ వివాదాలుగా మొదలైన గొడవలు దాడుల వరకు వెళ్లాయట. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌తో పాటు.. స్థానిక ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలు రాష్ట్ర స్థాయిలోనూ చర్చనీయాంశంగా అయ్యాయి. మంచిర్యాలలో వరుసగా జరుగుతున్న ఘటనలతో స్థానిక పోలీసుల వ్యవహార శైలిపై కూడా ప్రశ్నలు వచ్చాయి. దీంతో స్వయంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. స్థానిక పోలీసు అధికారులను పిలిపించి క్లాస్ పీకారాయన. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో…ఉలిక్కిపడి లేచిన లోకల్ పోలీసులు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు.
ఏకంగా సీపీ బైక్‌పై తిరుగుతూ శాంతిభద్రతల్ని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేశారు. 13 మంది రౌడీషీటర్స్ మంచిర్యాలలోకి ఎంటర్ అవకుండా ఆంక్షలు విధించారంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న నేతల తీరుపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయిందట. ఇలాగే కొనసాగితే కొందరిపై వేటు తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ కలిసి మంచిర్యాలలో ఊరూ, పేరు లేని నాయకున్ని వెనక ఉండి నడిస్తున్నారనే విషయాన్ని అధిష్టానం గుర్తించిందట. గతంలో ఎన్నడూ లేనిది మంచిర్యాలలో ఇలా కొందరు వ్యక్తులు పేట్రేగిపోవడం ఏంటంటూ వారికి ప్రశ్నలు సంధించింది.
అదే సమయంలో నగర బహిష్కరణకు గురైన వారు కూడా అదే వర్గానికి చెందిన వారు కావడం మరో చర్చకు దారి తీస్తోందట. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ వర్గానికి చెందిన నాయకులు సైలెంటయ్యారనే ప్రచారం సాగుతోంది. దీంతో… మంత్రి వివేక్, ఎంపీ వంశీ అండతో కాస్త స్పీడ్ అందుకున్న నాయకుడు ఒకరికి అది లోనే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకుంటున్నారు.
మొత్తానికి మంచిర్యాల రాజకీయాల్లో హైడ్రామాకు తెరపడినట్లేనన్నది ప్రస్తుతానికి లోకల్ టాక్. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదంటూ ఒకవైపు పోలీసులు రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేయడం, మరోవైపు నాయకులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ కావడంతో, మంచిర్యాల రచ్చ కాస్త సద్దుమణిగిందని అంటున్నారు. అయితే… ఇది పోలీసులు, హైకమాండ్‌కు భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో వేసిన వెనకడుగా? లేక నిజంగానే లోకల్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టినట్టేనా అన్నది తేలాల్సి ఉంది. మంచిర్యాల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ సబ్జెక్ట్.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
-
OTR: పనితీరు బాగుంటేనే టికెట్.. రెండోసారి గెలుపు కోసం రేవంత్ కసరత్తు..!
-
Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్… వైరల్ అవుతున్న చెక్!
-
AP Govt: మీకు గుంత కనిపించిందా.. వెంటనే ఇలా చేయండి.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..
-
Alias Rukmini రిలీజ్‌కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!