Nanna Kutty Review: ‘నాన్న కుట్టి’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2 / 5
- MAIN CAST: విజయ్ ఆంటోని, ప్రీతీ అస్రానీ, బేబీ లితన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్ తదితరులు
- DIRECTOR: ము. మారన్
- MUSIC: విజయ్ ఆంటోని
- PRODUCER: విజయ్ ఆంటోని, మీరా విజయ్ ఆంటోని, రామంజనేయులు జవ్వాజీ
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోని, ఆ తర్వాత అదే స్థాయి హిట్ కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒక సినిమాతో థియేటర్లలోకి వచ్చే ఆయన, ఈసారి తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ను నమ్ముకుని ‘నాన్న కుట్టి’గా మన ముందుకు వచ్చారు. ము. మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు కదిలించింది? విజయ్ ఆంటోనికి కోరుకున్న విజయాన్ని అందించిందా? పూర్తి రివ్యూలో చూద్దాం.
నాన్న కుట్టి కథ:
వైజాగ్‌లో ఉండే సూర్య (విజయ్ ఆంటోని) ఒక పసిపాపను తీసుకుని ఊటీకి వస్తాడు. అక్కడ లొకేషన్ ఇంచార్జ్, క్యాస్టింగ్ ఏజెంట్‌గా పనిచేస్తూ, ఆ పాప దియా (బేబీ లితన్య)ను కంటికి రెప్పలా పెంచుకుంటాడు. అమ్మ రేవతి చనిపోయిందని దియాకు అబద్ధం చెబుతూ సింగిల్ పేరెంట్‌గా జీవిస్తుంటాడు. దియా చదువుకునే స్కూల్లోనే టీచర్‌గా పనిచేసే అనిత (ప్రీతీ అస్రానీ)కి దియా అంటే ఎంతో ప్రేమ. ఈ క్రమంలో సూర్యను ఇష్టపడి, ఆ పాపకు అమ్మగా మారాలని అనుకుంటుంది. కానీ సూర్య మాత్రం ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో, చనిపోయిందనుకున్న రేవతి ఊటీలో అనితకు కనిపిస్తుంది. దీంతో అనిత సూర్యను నిలదీస్తుంది. సరిగ్గా అదే సమయంలో దియా స్పృహ తప్పి పడిపోతుంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా, పాపకు ‘సివియర్ అప్లాస్టిక్ అనీమియా’ అనే ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధి ఉందని డాక్టర్లు చెబుతారు. పాప బతకాలంటే, తన తోబుట్టువు (అప్పుడే పుట్టిన బిడ్డ) నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్‌తో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని సూచిస్తారు. అప్పుడు అనిత, రేవతి దగ్గరకు వెళ్దామని చెప్పగా.. అసలు దియా తన కన్నకూతురే కాదని సూర్య షాకింగ్ నిజం చెబుతాడు. అసలు దియా ఎవరి కూతురు? సూర్య ఆమెను ఎందుకు పెంచుతున్నాడు? పాపను బతికించుకోవడానికి సూర్య ఆ కన్నతల్లిదండ్రులను ఎలా కనిపెట్టాడు? చివరకు దియా బతికిందా లేదా? అన్నదే మిగిలిన కథ.
Also Read
విశ్లేషణ:
పూణేలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు ము. మారన్ ఈ కథను అల్లుకున్నారు. ఒక బిడ్డను కాపాడాలంటే, ఆమె కన్నతల్లిదండ్రులు మరో బిడ్డను కనాల్సిందే అనే కోర్ పాయింట్ వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ, ఒక మంచి పాయింట్‌ను ఎంచుకుంటే సరిపోదు, దానికి తగ్గ బలమైన స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. సినిమా ఓపెనింగ్‌లో వచ్చే ఫైట్ సీన్, సూర్య పాపను తీసుకుని పారిపోవడంతో కథపై కాస్త క్యూరియాసిటీ కలుగుతుంది. కానీ, కథ ఊటీకి షిఫ్ట్ అయ్యాక అక్కడే ఆగిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాపను స్కూల్‌కు తీసుకెళ్లడం, తీసుకురావడం, తండ్రీకూతుళ్ల ఆటలు, టీచర్ అనిత వన్-సైడ్ లవ్ ట్రాక్‌తోనే సాగుతుంది. మధ్యలో హీరో ఫ్రెండ్ వేసే నవ్వురాని జోకులు మరింత విసుగు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ వరకు అసలు కథే కదలకపోవడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఎదురవుతుంది. ప్రీ-ఇంటర్వెల్లో రేవతి ఎంట్రీ, ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆసక్తిని పెంచినా, సగటు ప్రేక్షకుడు దాన్ని ముందే ఊహించేయగలడు.
సెకండాఫ్‌లో వచ్చే సూర్య-రేవతి ఫ్లాష్‌బ్యాక్ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. అయితే పాప సూర్య దగ్గరకు ఎలా వచ్చిందనే పాయింట్ పర్వాలేదనిపిస్తుంది. ఆ తర్వాత అసలు తల్లిదండ్రుల కోసం వెతికే ప్రాసెస్, వారిని బతిమాలే సన్నివేశాలను మరీ సాగదీశారు. దీనికి తోడు హ్యూమన్ ట్రాఫికింగ్, బెగ్గింగ్ మాఫియా వంటి అంశాలను ఇరికించి కథను కాస్త గందరగోళంగా మార్చేశారు. హీరోయిన్ పాత్ర సెకండాఫ్‌లో పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఎమోషన్స్ సహజంగా కాకుండా, బలవంతంగా పిండినట్లు అనిపిస్తాయి. అయితే, క్లైమాక్స్‌లో వచ్చే కోర్ట్ డ్రామా, ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో పాప దియా చెప్పే ఎమోషనల్ మాటలు మాత్రం కాస్త ఊరటనిచ్చి కంటతడి పెట్టిస్తాయి. సినిమా రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలే ఉండటం ఒక్కటే కాస్త రిలీఫ్.
నటీనటుల పనితీరు:
సెంటిమెంట్ పాత్రలకు విజయ్ ఆంటోని బాగానే సరిపోయినా, నటనలో మాత్రం ఎప్పటిలాగే కొత్తదనం లేదు. యాక్షన్ అయినా, ఎమోషన్ అయినా, కామెడీ అయినా అదే సింగిల్ ఎక్స్ప్రెషన్తో సినిమా మొత్తాన్ని లాగించేశారు. ఈ సినిమాకు అసలైన ప్రాణం బేబీ లితన్య. తన క్యూట్ నటనతో ఆకట్టుకోవడమే కాకుండా, క్లైమాక్స్ సీన్లలో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కదిలించింది. చీరకట్టులో చాలా అందంగా, హుందాగా కనిపించింది ప్రీతీ అస్రానీ. నటిగా పరిణతి చూపించింది కానీ, ఆమె పాత్రకు కథలో సరైన ప్రాధాన్యత దక్కలేదు. భగవతి పెరుమాళ్ తన విలక్షణ పాత్రలో మెప్పించారు. హరిప్రియ ఇసై ఎమోషనల్ రోల్లో బాగానే చేసింది. అరువి మధన్, జెన్సన్ దివాకర్ మరియు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ము. మారన్ మంచి కథా వస్తువును తీసుకున్నప్పటికీ, దాన్ని ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. కథనంలో వేగం, ఎమోషన్లో గాఢత లోపించాయి. సంగీత దర్శకుడిగా విజయ్ ఆంటోని ఈసారి నిరాశపరిచారు. పాటలు ఆయన పాత సినిమాల ట్యూన్స్‌నే గుర్తుచేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ యావరేజ్‌గా ఉంది. విజువల్స్ నీట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఊటీ అందాలను కెమెరాలో చాలా చక్కగా బంధించారు. ఫస్ట్ హాఫ్‌లో ల్యాగ్ సీన్లకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి కానీ, కొన్ని చోట్ల హడావుడిగా చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.
‘నాన్న కుట్టి’.. ఓ రొటీన్ ఎమోషనల్ డ్రామా!
తాజావార్తలు
-
Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
-
Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
-
Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
-
Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
-
Ramayana : ‘రామాయణ’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!