WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deandra Dottin Bowled Without Facing a Ball: క్రికెట్లో రనౌట్, బౌల్డ్, క్యాచ్, స్టంపింగ్ వంటి ఎన్నో రకాల ఔట్లు చూస్తుంటాం. కానీ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బ్యాటర్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరడం ఎప్పుడైనా చూశారా..? లేదు కదా.. అయితే ఇప్పుడు అలాంటి అరుదైన ఘటన ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL 2026)లో చోటుచేసుకుంది. మెల్బోర్న్లోని జంక్షన్ ఓవల్ వేదికగా మెల్బోర్న్ రెనెగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియాండ్రా డాటిన్ ఈ విచిత్రమైన రీతిలో ఔటైంది.
ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తొలుత బ్యాటింగ్ చేసి 138 పరుగుల లక్ష్యాన్ని మెల్బోర్న్ రెనెగేడ్స్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ జట్టు 97 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన డియాండ్రా డాటిన్ క్రీజులోకి చేరుకోవడానికి 75 సెకన్లకు పైగా సమయం తీసుకుంది. నిర్ణీత సమయంలో బ్యాటింగ్‌కు సిద్ధం కాకపోవడంతో అంపైర్లు WBBL ప్రత్యేక నిబంధనను అమలు చేశారు.
Also Read
- 144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
- AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
- AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
- Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
ఈ నిబంధన ప్రకారం కొత్త బ్యాటర్ 75 సెకన్లలో బంతిని ఎదుర్కోవడానికి సిద్ధం కాకపోతే, బ్యాటర్‌ను పక్కకు నిలబెట్టి బౌలర్‌కు ఖాళీ స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతి వేసే అవకాశం కల్పిస్తారు. ఆ బంతి నేరుగా వికెట్లను తాకితే బ్యాటర్ ఔట్ అయినట్లే. ఈ అవకాశాన్ని బ్రిస్బేన్ హీట్ బౌలర్ సారా గ్లెన్ చక్కగా ఉపయోగించుకుంది. ఆమె వేసిన బంతి నేరుగా స్టంప్స్‌ను తాకడంతో డాటిన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బౌల్డ్ అయింది. దీంతో ఆమె గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది.
WBBL, BBL చరిత్రలో ఈ ప్రత్యేక నిబంధన ద్వారా నమోదైన తొలి వికెట్ ఇదే. ఈ ఘటనపై రెనెగేడ్స్ కెప్టెన్ సోఫీ మోలిన్యూ స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితి క్రికెట్లో గతంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. సారా గ్లెన్ ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందని ప్రశంసించింది. ఇలాంటి ఘటనలు ఆటగాళ్లకు నిబంధనలపై అవగాహన కల్పించే పాఠాలని అభిప్రాయపడింది. మరోవైపు, డాటిన్ వికెట్ కోల్పోయినప్పటికీ మెల్బోర్న్ రెనెగేడ్స్ వెనక్కి తగ్గలేదు. 97 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు, మిగతా బ్యాటర్ల పోరాటంతో లక్ష్యానికి చేరువైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Extraordinary.
Deandra Dottin was late to the middle. Now she’s out after Sarah Glenn hit the stumps with a ball she couldn’t face! #WBBL12 https://t.co/lsG3SZAw8b
— Weber Women’s Big Bash League (@WBBL) November 25, 2026
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
-
Egypt Oil Tanker Explosion: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో 31 మంది మృతి, 21 మందికి పైగా గాయాలు
-
US Tariff Threat: భారత్‌పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!