Bhogi Movie Review: భోగి మూవీ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Sharwanand, Anupama Parameswaran, Dimple Hayathi
- DIRECTOR: Sampath Nandi
- MUSIC:
- PRODUCER: K.K. Radhamohan
Bhogi Movie Review: ఈ ఏడాది మొదట్లోనే నారి నారి నడుమ మురారి అనే సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్, ఇప్పుడు భోగి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సంపత్ నంది దర్శకత్వంలో, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి మరో కీలక పాత్రలో నటించింది. ఒకసారి వాయిదా పడి ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
1960లలో, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బొగ్గుల గుట్ట అనే పల్లెటూరిలో గంగ (శర్వానంద్) తన ఐదుగురు చెల్లెళ్లతో కలిసి జీవిస్తూ ఉంటాడు. బతకడం కోసం ఒక పక్క కుమ్మరి పని చేస్తూ, మరో పక్క వ్యవసాయం కూడా చేస్తుంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి తన ఇంటి పక్కనే ఉండే సులోచన (అనుపమ పరమేశ్వరన్) అంటే ఎంతో ఇష్టం. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో, ఓ రోజు తన అన్న జంపన్న బదులు ఆ ఊరి పటేల్ చెప్పిన ఓ పని చేయడం కోసం గంగ దగ్గర్లో ఉన్న గూడానికి వెళ్తాడు. అక్కడ కొంతమంది ఆడపిల్లలను దొంగిలించి తీసుకువెళ్లి బలి ఇస్తున్నారని తెలిసి, వాళ్లందరినీ ఆ బలి నుంచి తప్పిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న గంగ ఏం చేశాడు? అసలు అంతమందిని ఎందుకు బలి ఇస్తున్నారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? చివరికి గంగ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ఒకటి రెండు రా అండ్ రస్టిక్ (raw and rustic) సినిమాలు నడవడంతో, ఎందుకో టాలీవుడ్ అంతా అలాంటి సినిమాలనే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. అందులో భాగంగానే, పూర్తిస్థాయి ఫ్యామిలీ అండ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న శర్వానంద్‌తో ఇలాంటి ఒక పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ సినిమా చేయడం విశేషం.
సంపత్ నందికి మంచి మాస్ సినిమాలు చేస్తాడనే పేరు ఉంది. అలాంటి దర్శకుడు పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ కథ రాసుకుని, శర్వానంద్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
అయితే, సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఇది నార్మల్ సెటప్ కాదని ఈజీగా అర్థమైపోతుంది. సినిమాలో ఎక్కడా సహజత్వం (naturality) కనిపించదు. ఎందుకంటే, కథ 1960ల కాలంలో రాసుకుని ఉండడంతో, సినిమాకి సంబంధించిన ఏ ఒక్క సీన్ కూడా నేచురల్ లొకేషన్లో చేయలేని పరిస్థితి. దీని కోసం ఏకంగా 15 ఎకరాల్లో ప్రత్యేకమైన సెట్ కూడా నిర్మించారట.
సినిమా ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా ఆడపిల్లలు మాయమవ్వడం, ఆ తర్వాత హీరో పరిచయం, చెల్లెళ్లతో హీరో అనుబంధం చూపిస్తూనే ఎక్కువగా ల్యాగ్ చేయకుండానే కథలోకి తీసుకువెళ్లిపోయాడు దర్శకుడు. ఇంటర్వెల్ సమయానికి హీరో చెల్లెళ్లు చనిపోవడం, హీరోని విలన్ గ్యాంగ్ చచ్చేలా కొట్టిపారేయడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఆ తర్వాత హీరో ఎలా తన పగ తీర్చుకున్నాడు? అలాగే నరబలి కాన్సెప్ట్‌ని ఆపి, ఆ ఊరి వారందరికీ ఎలా సాయం చేశాడు అనేది కథగా రాసుకున్నారు. అయితే ఇదంతా వినడానికి బాగానే ఉన్నా, తెరపై ఆవిష్కరించడం (execution) విషయంలో మాత్రం చాలా కఠినమైన పనే. ఆ విషయం సినిమా చూస్తున్న అందరికీ ఈజీగానే అర్థమైపోతుంది. కాకపోతే, ఫస్టాఫ్ ఎంగేజ్ చేసినంతగా సెకండాఫ్ ఎంగేజ్ చేయలేదు. సెకండాఫ్ పూర్తిస్థాయిలో తడబడుతున్న ఫీలింగ్ వస్తుంది. నిజానికి, ఈ నరబలి కాన్సెప్ట్‌తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో నరబలి కారణంగా హీరో చేసే విలయతాండవం వల్ల రక్తపాతం ఎక్కువైపోయింది.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, శర్వానంద్‌ది వన్-మ్యాన్ షో అని చెప్పొచ్చు. పూర్తిస్థాయిలో ఒక రగ్డ్ (rugged) అవతారంలో కనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా శర్వానంద్ నటనలో పరిణతి కనిపించింది. అయితే, పూర్తిస్థాయి మాస్ మేకోవర్ విషయంలో ఈ పాత్ర ఉపయోగపడినంతగా సినిమా రిజల్ట్ ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది.
అనుపమ పరమేశ్వరన్ పాత్ర చాలా పరిమితమైనప్పటికీ మెప్పించింది. అయితే, ప్రమోషన్స్‌లో హడావిడి చేసిన డింపుల్ హయాతి పాత్ర ఇంకా పరిమితం. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా, పటేల్ పాత్రలో నటించిన వ్యక్తి పాత్రను ఎందుకో కొంచెం లిమిటెడ్‌గా చూపించారనిపించింది. బహుశా ఎడిట్‌లో కట్ అయ్యిందేమో.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌వర్క్ కూడా ఆకట్టుకుంది. సినిమాను చాలా రూటెడ్‌గా చూపించడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. యాక్షన్ సీన్స్ అయితే ఆకట్టుకునేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని ఫైట్స్ కంపోజ్ చేసిన తీరు బాగుంది. కానీ రక్తపాతం మితిమీరకుండా చూసుకుని ఉంటే బాగుండేది. అప్పుడు సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని చెప్పొచ్చు. సినిమా నిడివి విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉండొచ్చు.
ఫైనల్ వర్డిక్ట్: భోగి రా అండ్ రస్టిక్ మూవీ విత్ హెవీ బ్లడ్ బాత్
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఆరు మ్యాచ్‌లు.. ఆరు విజయాలు.. ముంబై జైత్రయాత్ర.. కెప్టెన్సీతో అదరగొట్టిన స్కై..!
-
TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
-
Delimitation 2026: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు? డీలిమిటేషన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన!
-
IND vs NZ 2nd Test: జడేజా, సిరాజ్‌లను పక్కన పెట్టారు.. భారీ మూల్యం చెల్లించారు!
-
Hyderabad: హైదరాబాద్ చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడులు.. 200 కిలోల కుళ్లిన చేపలు సీజ్!
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!