OTR : గన్నవరం టీడీపీలో అసంతృప్తి.. యార్లగడ్డ వైఖరిపై అధిష్టానం సీరియస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిందపడ్డా పైచేయి నాదేనన్నట్టుగా ఆ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ కంచుకోటను అప్పనంగా ప్రత్యర్థులకు అప్పజెప్పే పనిలో బిజీగా ఉన్నారా? వరుస దెబ్బలు తగులుతున్నా… పట్టించుకోకుండా ఈగోకు పోతున్నారా? పాడిందే పాట అన్నట్టుగా ఎంతసేపూ…. ఆ రోజుల్లో…. అంటూ దీర్ఘాలు తీయడం తప్ప ఈ రోజు చేసిందేం లేదంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? మంగళవారం మాటలంటూ సొంత పార్టీ కేడరే నాటుగా, ఘాటుగా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది? ఏపీలో ఎప్పుడూ… పొలిటికల్ నెగడు రగులుతూ ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గన్నవరం మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో మరోసారి ఇక్కడ రాజకీయ రచ్చ మొదలైంది. ప్రధానంగా టీడీపీ తరపున ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీరుపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. వైసీపీ తరపున 2019లో గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ… ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో.. వెంకట్రావు మీద టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టారు. అదే సమయంలో యార్లగడ్డ టిడిపిలోకి షిఫ్ట్ అయి.. 2024 ఎన్నికల్లో వంశీ మీదే విజయం సాధించారు. కానీ… ఆ తర్వాత కేడర్ని పూర్తిస్థాయిలో కలుపుకుని పోవడంతో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గ టిడిపికి కంచుకోట. 2019 వైసీపీ హవాలో కూడా ఇక్కడ సైకిల్‌కు తిరుగులేదు. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల నుంచి వరసగా పసుపు జెండా ఎగురుతూనే ఉంది. అలాంటి చోట ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పార్టీ అధికారంలో ఉండి కూడా బోర్లా పడటానికి ఎమ్మెల్యే వైఖరే కారణమని అంటున్నారు తమ్ముళ్ళు.
Also Read
37వేల మెజార్టీతో గన్నవరం ఎమ్మెల్యే సీటు గెల్చుకున్న టీడీపీ… రెండున్నరేళ్ళలో లోకల్ బాడీస్‌లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి యార్లగడ్డ చేతగానితనమే ప్రధాన కారణం అంటూ లోకల్ టీడీపీ నాయకులే ఫైరవుతున్నారట. జిల్లాలోని 26 జడ్పీటీసీ స్థానాలకుగాను ఒకే ఒక్కచోట గెలిచింది వైసీపీ. ఆ ఒక్కటీ గన్నవరంలోనే కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. స్థానిక టిడిపి నేతలతో ఎమ్మెల్యే వెంకట్రావుకు గ్యాప్ రావడంతోనే గన్నవరం స్థానాన్ని టిడిపికి కాకుండా… మిత్రపక్షమైన బిజెపికి ఇచ్చారని, చివరికి సమన్వయలేమి దెబ్బ తీసిందని విశ్లేషిస్తున్నారు.చివరికి గన్నవరం జడ్పీటీసీని వైసిపి గెలవడంతో ఓటమి నెపాన్ని బీజేపీ మీదేసి యార్లగడ్డ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారన్న అభిప్రాయం సైతం ఉంది నియోకవర్గంలో. ఇక్కడ బీజేపీ బలమెంతో టిక్కెట్ కేటాయించేటప్పుడు ఆయనకు తెలియదా? ఎమ్మెల్యేగా గెలుపు ఓటములకు బాధ్యత లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఒక వైపు ప్రభుత్వ నిర్ణయాల మీద విమర్శలు చేస్తూ… ప్రభుత్వాన్ని ,పార్టీని ఇరుకున పెడుతున్న యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ఫలితాల్లో కూడా వెనక పడటంతో అధిష్టానం సీరియస్‌గా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. పరిషత్ ఎన్నికల ఫలితాలతో లోపం ఎక్కడుందో ఎమ్మెల్యే గుర్తిస్తారని భావించినా… అలాంటిదేమీ లేకపోగా…రివర్స్ మాటలు బాగా తేడా కొడుతున్నాయంటున్నారు టీడీపీ నాయకులు.
నియోజకవర్గంలో 84 గ్రామ పంచాయతీలు ఉంటే…. కూటమి 44 స్థానాల్లో, వైసిపి ఏకంగా 40 పంచాయతీల్లో గెలవడాన్ని చూస్తుంటే… గన్నవరం లో ఏం జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో మళ్లీ యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం పెట్టి మరీ… పెద్దగా నష్టం ఏమీ జరగలేదని చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ళు ఇంకా ఫైరవుతున్నారు. ఒకవైపున సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకగ్రీవాల మీద దృష్టి పెట్టాలని చెబుతుంటే… ఎమ్మెల్యే యార్లగడ్డ మాత్రం తనకు ఏకగ్రీవాలు ఇష్టం లేదని, టిడిపి జనసేన మధ్య ఫ్రెండ్లీ పోటీని తానే ఎంకరేజ్ చేశానన్నట్టు అన్న మాటలపై మండిపడుతున్నారు టీడీపీ నాయకులు. యార్లగడ్డ వైఖరితో నియోజకవర్గంలో ప్రత్యర్థి వల్లభనేని వంశీ పుంజుకుంటున్నారని కూడా అసహనంగా ఫీలవుతున్నారట లోకల్ టీడీపీ లీడర్స్. నియోజకవర్గంలో టిడిపి కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న వాళ్లను పక్కనపెట్టి వైసిపి నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించటం, ఏకపక్ష నిర్ణయాల కారణంగానే ఈ ఫలితాలు వచ్చాయినే చర్చ జరుగుతోంది. ఫలితాలను విశ్లేషించుకుని చక్కదిద్దుకోవాల్సిన ఎమ్మెల్యే…అది వదిలేసి పోటీ చేసిన అన్ని చోట్ల గెలవలేమని చెప్పటం, మీడియా మీద అక్కసు వెళ్ళగక్కడం చూసి పార్టీ నాయకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారట. ఇకనైనా తీరు మార్చుకొని కంచుకోట వంటి గన్నవరంలో పార్టీని బతికిస్తారో లేక తాను చేసిందే కరెక్ట్ అంటూ నేల విడిచి సాము చేస్తారో చూడాలంటున్నారు టీడీపీ లీడర్స్.
- Tags
- Gannavaram TDP
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్‌లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
-
OTR: పనితీరు బాగుంటేనే టికెట్.. రెండోసారి గెలుపు కోసం రేవంత్ కసరత్తు..!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!