Aakasamlo Oka Tara Movie Review: ఆకాశంలో ఒక తార రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3.5 / 5
- MAIN CAST: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహానీ శర్మ, నాజర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, శ్వాసిక తదితరులు
- DIRECTOR: పవన్ సాధినేని
- MUSIC: జీవీ ప్రకాశ్ కుమార్
- PRODUCER: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం (గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా)
కథల ఎంపికలో దుల్కర్ సల్మాన్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన టేస్ట్ చూపిస్తుంటారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత ఆయన నుంచి వచ్చిన మరో తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో, కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్ గా, శృతి హాసన్ ప్రధానపాత్రలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు కనెక్ట్ చేసుకుందో చూద్దాం.
ఆకాశంలో ఒక తార కథేంటంటే:
కనీస వసతులు కూడా లేని పాలలంక అనే మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి కల్పన (సాత్విక వీరవల్లి). చిన్నప్పటి నుంచే ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) కావాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని బలంగా కలలు కంటుంది. కానీ ఆడపిల్లకు చదువు ఎందుకనే మనస్తత్వం ఉన్న తండ్రి శివయ్య (కోట జయరాం), పదో తరగతిలోనే కల్పన చదువు ఆపేసి కృష్ణ (దుల్కర్ సల్మాన్) అనే డ్రైవర్ అవ్వాలనుకునే మెకానిక్‌తో పెళ్లి చేసేస్తాడు. పెళ్లయ్యాక కల్పన కల గురించి తెలుసుకున్న కృష్ణ.. తన భార్య ఆశయాన్ని తన లక్ష్యంగా మార్చుకుంటాడు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను తట్టుకుని హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి ఐఐటీలో సీటు సాధించేలా ప్రోత్సహించడం, భార్య చదువు కోసం తాను గుజరాత్ వెళ్లి రాత్రింబవళ్ళు కష్టపడతాడు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో కల్పన చేసిన ఒక రాకెట్ ప్రయోగం ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత కల్పన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రైవేట్ స్పేస్ సెంటర్ అధినేత రోహిణి (శ్రుతి హాసన్), గుజరాతీ అమ్మాయి బిజిలీ (రుహానీ శర్మ) ఈ కథలోకి ఎందుకు? ఎలా వచ్చారు? చివరకు కల్పన అంతరిక్షంలోకి అడుగుపెట్టిందా లేదా? అన్నదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ: ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా కథ ఏంటో, ముగింపు ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి ప్రెడిక్టబుల్ లైన్‌ను తీసుకుని, రెండున్నర గంటలకు పైగా ఆడియన్స్‌ను బోర్ కొట్టించకుండా కూర్చోబెట్టడం దర్శకుడికి నిజంగా పెద్ద ఛాలెంజ్. ఆ విషయంలో పవన్ సాధినేని సక్సెస్ అయ్యారు. కమర్షియల్ హంగుల కోసం అనవసరమైన ఫైట్లు, ఐటమ్ సాంగ్స్, లౌడ్ బీజీఎం లాంటివి జోడించకుండా చాలా క్లీన్ అండ్ హానెస్ట్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫస్టాఫ్ అంతా కల్పన నేపథ్యం, పెళ్లి, కృష్ణ సపోర్ట్ చుట్టూ ఎమోషనల్‌గా సాగుతుంది. గుజరాత్లో కృష్ణ పడే కష్టాలు, బిజిలీతో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే మిషన్ ఫెయిల్యూర్ ఎపిసోడ్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో శ్రుతి హాసన్ ఎంట్రీతో కథలో కొత్త ఎనర్జీ వస్తుంది. కృష్ణ, కల్పన, రోహిణి మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాకు హైలైట్. తండ్రితో కూతురు మాట్లాడే సీన్, క్లైమాక్స్ ఎమోషన్స్ మనసును హత్తుకుంటాయి. అక్కడక్కడా స్లో పేస్, ముందే ఊహించగలిగే మలుపులు మైనస్ అయినా, ఓవరాల్‌గా ఈ సినిమా ఒక మంచి ఫీల్-గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మంచి సినిమాలు రావడం లేదు అని ఫీల్ అయ్యే టాలీవుడ్ లవర్స్ కి ఒక ఫీస్ట్ లా ఈ సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి పాత్ర ఒప్పుకోవడంతోనే సగం విజయం సాధించాడు దుల్కర్ సల్మాన్. ఒకరకంగా ఈ సినిమా సాత్విక వీరవల్లి సినిమా కానీ దుల్కర్ ఒక సపోర్టింగ్ రోల్ చేశాడు కానీ అదరగొట్టాడు.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ తన ఇమేజ్ పక్కన పెట్టి ఒక సామాన్యుడిగా ఒదిగిపోయారు. భార్య కల కోసం తపించే భర్తగా ఆయన నటన చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది. ఇక ఈ సినిమాకు అసలైన సర్ప్రైజ్ కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి. తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా అమాయకత్వం, పట్టుదల, బాధ లాంటి ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించింది. దుల్కర్‌తో పోటీపడి నటించింది. పవర్ఫుల్ పాత్రలో శ్రుతి హాసన్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. బిజిలీగా రుహానీ శర్మ, అక్క పాత్రలో శ్వాసిక, ఇతర పాత్రల్లో నాజర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్ తమ పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నీషియన్స్ పనితీరు విషయానికి వస్తే జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఎమోషనల్ సీన్స్‌ను తన ఆర్ఆర్తో మరో స్థాయికి తీసుకెళ్లారు. పాటలు కథలో భాగంగా బాగున్నాయి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా, ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా ఉంది. గుణ్ణం గంగరాజు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకు బలంగా నిలిచాయి. ముఖ్యంగా ‘‘నీ కల ఆకాశం అయినప్పుడు ఈ భూమిని ఏం చేసుకుంటాం’’ లాంటి మాటలు గుర్తుండిపోతాయి. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి, కానీ కొన్ని సీజీ, ఏఐ విజువల్స్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది.
చివరగా: ‘ఆకాశంలో ఒక తార’ ఒక అందమైన ఎమోషనల్ జర్నీ. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన ఒక హానెస్ట్ అప్ లిఫ్టింగ్ మూవీ.
తాజావార్తలు
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
-
Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!