OTR: వైసీపీకి దూరంగా తమ్మినేని సీతారాం?.. కీలక సమయంలో ఎందుకు సైలెంట్?
- స్థానిక ఎన్నికల్లో ఎక్కడా కనిపించని తమ్మినేని జాడ
- ఎటు పోయారు? ఏమైందంటూ వైసీపీ వర్గాల్లో చర్చలు
- వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తమ్మినేని
- మేం తెగించి పోరాడుతుంటే ఆయన ఎక్కడంటున్న కేడర్
- తన కోసం పని చేసిన వాళ్ళను కూడా పట్టించుకోలేదన్న టాక్
- రేపు మా అవసరం ఆయనకు లేదా అని ద్వితీయ శ్రేణి ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కోలు ఫ్యాన్ సీనియర్ లీడర్ ఎక్కడ? స్థానిక ఎన్నికల్లో ఓ రేంజ్ పోరాటం జరుగుతున్నా… ఆయన పత్తా లేకుండా పోవడానికి కారణం ఏంటి? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా అంతటోడు లేడన్నట్టు మాట్లాడిన నేత ఇప్పుడు కీలకమైన టైంలో కనుమరుగవడం ఏంటి? వైసీపీకి దూరం అవుతున్నారా అంటూ సందేహాలు పెంచుతున్న ఆ బడా లీడర్ ఎవరు? ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ హాట్‌గా జరిగాయి. మున్సిపల్, పరిషత్ ఎలక్షన్స్‌లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి పార్టీలు. అధికార కూటమి డామినేషన్ కనిపించినా… చాలా చోట్ల ఢీ అంటే ఢీ అంది విపక్షం వైసీపీ. పార్టీ తరపున బడానేతలు రంగంలోకి దిగారు. ప్రచారాలు చేశారు, పార్టీ సమన్వయ కమిటీల సమావేశాలు నిర్వహించారు. ఇంత జరుగుతున్నా…. ఎన్నికల సందట్లో ఎక్కడా…. సీనియర్ లీడర్ తమ్మినేని సీతారాం జాడ మాత్రం కనిపించలేదు. దీంతో… ఆయన ఎటు పోయారు? అసలేమైందంటూ… సొంత పార్టీ వర్గాలే ఆరా తీస్తున్నాయి. ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలకు మెదటిదశలో, శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీకి రెండో దశలో ఎన్నికలు జరిగాయి.
Also Read
- OTR: వనపర్తి కాంగ్రెస్‌లో అంతులేని పొలిటికల్ వార్..!
- Off The Record: పరిషత్ ఎన్నికల దెబ్బ.. పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే థామస్‌కు అగ్నిపరీక్ష..
- OTR: తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఘర్షణలు..! రాజకీయ వైరమా?.. వ్యక్తిగత శత్రుత్వమా?
- OTR: "ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్".. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
ఈ ఎలక్షన్స్‌లో ఎక్కడా… సీతారాం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా జోక్యం చేసుకోలేదట. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముగిసిపోయి సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నా… ఆయన ఎక్కడా కనిపించడం లేదని, దిశానిర్దేశం కొరవడిందని, అసలు యాక్టివ్‌గా ఉన్నారో లేదో కూడా అర్ధం కావడం లేదని మాట్లాడుకుంటున్నారు వైసీపీ నాయకులు. పైగా ఆయన బాధ్యతాయుతమైన పార్టీ వదవిలో ఉన్నారు కూడా. వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తమ్మినేని మౌనం వెనుక అంతరార్ధం ఏంటో అర్ధం కావడం లేదని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీని కాపాడుకోవడానికి మేం అధికార పార్టీకి ఎదురొడ్డి పోరాడుతున్నాం.. అయినా ఆయన మాత్రం ఎక్కడా ఎందుకు కనిపించడం లేదంటూ… కింది స్థాయి నాయకులు కూడా క్వశ్చన్‌మార్క్ ఫేస్‌లు పెడుతున్నారట.
దశాబ్దాలుగా తన వెన్నంటి ఉన్న లోకల్ లీడర్స్ పోటీలో ఉన్నా… కనీసం మాటసాయం కూడా చేయకపోవడం ఏంటంటూ చర్చించుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకే గెలుపోటముల్ని పక్కనపెట్టి బరిలో దిగామని, అయినా సరే…ఇన్చార్జ్ హోదాలో ఉన్న నేత అసలు ఎక్కడున్నారో కూడా తెలియకపోవడం ఏంటంటూ నిలదీస్తోంది ద్వితీయ శ్రేణి నాయకత్వం. పార్టీ కోసం, తమ్మినేని కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తులు ఇప్పుడు క్షేత్రస్దాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా… చివరికి ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికలలో సైతం ఆయన జోక్యం చేసుకోకుండా…. అంటీ ముట్టనట్టు వ్యవహరించారన్న ఫీలింగ్ పెరుగుతోంది.
క్యాడర్‌కు అండగా నిలబడాల్సిన సమయంలో… ఆమదాలవలసను కూడా ఇన్చార్జ్ మీదికే వదిలేస్తే ఎలా…? రేపు మా అవసరం తమ్మినేనికి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారట లోకల్ వైసీపీ లీడర్స్. టీడీపీలో అన్ని పదవులూ కూన కుటుంబానికే అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు లోకల్ వైసీపీ నాయకులు. శక్తి మొత్తం కూడదీసుకుని కూటమి పార్టీలను ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం ప్రజల్లో ఉండే తమ్మినేని సీతారాం జాడ లేకపోవడం ఏంటో అర్ధం కావడం లేదని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
గతంలో అధికారం ఉన్నప్పుడు.. ఊ అంటే చాలు ప్రతిపక్షాలపై విరుచుకుపడే తమ్మినేని, నేడు కూటమి పార్టీలు ఎలక్షన్స్ టైంలో వ్యవహరిస్తున్న తీరు గురించి కనీసం ప్రశ్నించకపోవడం ఏంటన్నది కార్యకర్తల ప్రశ్న. ప్రచారం సంగతి ప్రక్కన పెడితే.. తమ్మినేని కనీసం మీడియాలో సైతం కనిపించకపోవడం ఏంటంటూ ఆరా తీస్తున్నారు సిక్కోలు వైసీపీ లీడర్స్. దీని గురించి పార్టీలో గట్టి చర్చే నడుస్తోంది.
తాజావార్తలు
-
OTR: వైసీపీకి దూరంగా తమ్మినేని సీతారాం?.. కీలక సమయంలో ఎందుకు సైలెంట్?
-
Hyderabad: ఓయోలో గుంటూరు యువకుడు అనుమానాస్పద మృతి..
-
Gold Sale Income Tax: తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొన్న వ్యక్తికి రూ.60 లక్షల ట్యాక్స్ షాక్.. అసలు ఏం జరిగిందంటే?
-
Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
-
OTR: వనపర్తి కాంగ్రెస్‌లో అంతులేని పొలిటికల్ వార్..!
ట్రెండింగ్
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!