Tollywood: మాస్ హీరోలుగా మారడం కాదు.. ఆ హీరోలను చూసి నేర్చుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, ఇప్పుడు కొన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు పోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టార్ హీరోల విషయం పక్కన పెడితే, మీడియం రేంజ్ హీరోలు వాళ్ళ స్టైల్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ్, మలయాళం ఇండస్ట్రీ హీరోలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళంలో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లాంటి నటులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ, సక్సెస్‌లను సాధిస్తూ వాళ్ళ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోలు మాత్రం మాస్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు.
మాస్ ఇమేజ్ ఉంటేనే స్టార్ హీరోలవుతారా?
ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లందరికీ మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టే వాళ్లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీడియం రేంజ్ హీరోలు కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు తప్పితే, కథ ఏంటి? కథనం ఎలా సాగుతుంది? అనే విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం లేదు. కత్తి పట్టుకొని నరికితే తల ఎగిరి పక్కన పడితేనే మాస్ హీరో అనే భ్రమలో హీరోలు ఉన్నారు. ఇది మార్చుకొని పక్క భాషల హీరోలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఆలోచిస్తే బాగుంటుంది. లేకపోతే టైర్ వన్ హీరో అవ్వడం పక్కనపెడితే, అసలు హీరోగానే కొనసాగడం కష్టం అవుతుంది.
Also Read
- Idupu Kayitham Song: ‘ఇడుపు కాయితం’ నుంచి మరో క్రేజీ సాంగ్..!
- 402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
- Delimitation Bill: డీలిమిటేషన్ బీజేపీ రాజకీయ కుట్ర.. ఏపీకి 25 ఎంపీ సీట్ల నష్టం..!
- Rohit Sharma: "తొలుత కెప్టెన్సీ వద్దనుకున్న.. అతడు చెప్పడంతోనే అంగీకరించా".. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసిన మన హీరోలు ధనుష్, దుల్కర్ సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగితే మంచిది. ఇప్పటికే ధనుష్ డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకొని సక్సెస్‌లను సాధిస్తున్నాడు. ఆయన ‘అసురన్’ లాంటి సినిమాలో 50 సంవత్సరాల వయసు గల వ్యక్తిగా నటించి మెప్పించాడు. దుల్కర్ సల్మాన్ సైతం వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్గా ఆయన చేసిన ‘ఆకాశంలో ఒక తార’ మూవీ సక్సెస్ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. రాబోయే రోజుల్లో మన హీరోలు కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తే, సక్సెస్‌లను సాధించి వాళ్ళ క్రేజ్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Tollywood: మాస్ హీరోలుగా మారడం కాదు.. ఆ హీరోలను చూసి నేర్చుకోండి..!
-
Idupu Kayitham Song: ‘ఇడుపు కాయితం’ నుంచి మరో క్రేజీ సాంగ్..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
Delimitation Bill: డీలిమిటేషన్ బీజేపీ రాజకీయ కుట్ర.. ఏపీకి 25 ఎంపీ సీట్ల నష్టం..!
-
Rohit Sharma: “తొలుత కెప్టెన్సీ వద్దనుకున్న.. అతడు చెప్పడంతోనే అంగీకరించా”.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!