సలార్ ట్రైలర్ బయటికి రావడమే లేట్.. డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయని గట్టిగా నమ్మారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది సలార్ ట్రైలర్. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ 2 ట్రైలర్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉంది. మరో ట్రైలర్ ఈ రికార్డ్‌ను టచ్ చేయలేదు. కెజిఎఫ్2 తర్వాత రెండో స్థానంలో 74 మిలియన్ వ్యూస్‌తో ఆదిపురుష్ ఉంది. లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ మూవీ ట్రైలర్ 71 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో ఉంది. అయితే.. సలార్ ట్రైలర్ ఈ రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసేసింది. 16 గంటల్లోనే సలార్ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 75 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 18 గంటల్లోనే సెంచరీ కొట్టేసింది.
24 గంటలు గడవకముందే 100 మిలియన్స్ వ్యూస్ టచ్ చేసింది. దీంతో ఇప్పటి వరకున్న డిజిటల్ రికార్డ్స్ అన్నీ సలార్ దెబ్బకు ఎగిరిపోయినట్టే. ఇదే కాదు.. టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ మార్క్‌ని టచ్ చేసిన రికార్డ్ కూడా సలార్‌దే. ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ 1 మిలియన్ లైక్స్ మార్క్‌ని 7 గంటల 43 నిమిషాలకు అందుకోగా.. సలార్ ట్రైలర్ 6 గంటల 04 నిమిషాలకే 1 మిలియన్ లైక్స్ రికార్డ్‌ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో కలెక్షన్స్ విషయంలోను సలార్ సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. కెజియఫ్ చాప్టర్ 2, ట్రిపుల్ ఆర్ సినిమాలు 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ రికార్డ్స్‌ను కూడా సలార్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఫైనల్‌గా సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
𝟏𝟎𝟎 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐞𝐰𝐬 𝐅𝐨𝐫 #SalaarTrailer 🔥💥https://t.co/n1ppfmkpoI#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/520rB0vFqP
— Hombale Films (@hombalefilms) December 2, 2023