ఇప్పటి వరకు జరిగిన మాస్ జాతర వేరు, ఇప్పుడు జరగబోయే ఊరమాస్ జాతర వేరు అని చెప్పడానికి వచ్చేస్తున్నాడు సలార్ భాయ్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అది ఒక్క సలార్ సినిమాతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఒకవేళ సలార్‌కు ఏ మాత్రం హిట్ టాక్ పడినా బాక్సాఫీస్ బద్దలు కాదు, ఆ లెక్కలను అంచనా వేయడం ఎవ్వరి వల్ల కాదని అంటున్నారు. హై ఓల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి సరైన విజువల్ ఇంకా బయటికి రాలేదు. టీజర్ వచ్చినా అందులో ప్రభాస్ ఫేస్‌ను కూడా సరిగ్గా చూపించలేదు. అందుకే సలార్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు మంత్ ఎండింగ్‌లో సలార్ ట్రైలర్ రిలీజ్ కానుంది. దానికంటే ముందే సలార్ ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… సలార్ ఫస్ట్ సాంగ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రేపో, మాపో మేకర్స్ నుంచి ఈ సాంగ్ అప్టేట్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందనే టాక్ నడుస్తోంది. అలాగే సలార్‌లో పెద్దగా పాటలు ఉండవని. కేవలం రెండు మాత్రమే ఉంటాయని ప్రచారం జరుగుతోంది కానీ బ్యాగ్రౌండ్‌లో ఆ సాంగ్స్ ఇచ్చే ఎలివేషన్స్ పీక్స్‌లో ఉంటుందట. అంతేకాదు ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ సాంగ్స్‌ను మరిపించేలా ఉంటుందని కేజీఎఫ్ రాఖీభాయ్ రేంజ్‌కు మించి రవి బస్రూర్ బీజిఎం కొడుతున్నాడని తెలుస్తోంది. అందుకే రెండు పాటలతోనే సరిపెట్టనున్నారని టాక్. అయితే సలార్ ఆల్బమ్ గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.