Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మనసు గురించి, మంచితనం గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. మొదటినుంచి కూడా ప్రభాస్ మొహమాటస్తుడు.. అందరితో కలిసిపోతాడు. కానీ, అందరిలో మాట్లాడాలంటే సిగ్గు. తన సర్కిల్ లో తప్ప బయట ఎక్కడా ఎక్కువ మాట్లాడడు. ఇక డార్లింగ్ కు అస్సలు కోపం వస్తుందా.. ? అనేది ఎవరికి తెలియదు. అంత మంచివాడు ప్రభాస్. అయితే ఈ మంచితనం ఎక్కువ అయిపోయిందని ప్రభాస్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం.. ప్రభాస్ తన స్థాయికి తగ్గ సినిమాలను ఎంచుకోవడం మరిచి.. మొహమాటం కొద్దీ.. కొన్ని పాత్రలు చేస్తాను అని చెప్పడమని చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ కు నో చెప్పడం అనేది రాదు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికి తెల్సిందే. కెరీర్ ప్రారంభంలో మొహమాటం కొద్దీ డార్లింగ్ .. కొన్ని సినిమాలను ఓకే చేయాల్సి వచ్చింది. అవి ఎంత డిజాస్టర్స్ ను అందుకున్నాయో అందరికీ తెల్సిందే.
Mega 157: ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ..
ఇక ఇప్పుడు కూడా ఈ మొహమాటం వలన ఒక సినిమాలో క్యామియో చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు టెన్షన్ అవుతున్నారు. మంచితనం ఉండొచ్చు కానీ, మరీ ఇంత మంచితనం పనికరాదు అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ లోని రాముడి లుక్ కు ఎన్ని విమర్శలు వచ్చాయో చూశాం .. ఇక ఇందులో మరో దేవుడు పాత్రలో కనిపించి.. ఇంకా విమర్శలు పాలు అవ్వడం ఎందుకు అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్నేహం కోసం.. ప్రభాస్ ఏదైనా చేస్తాడు.. ? అందుకే ఇలాంటి క్యామియోకు ఒప్పుకున్నాడు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి మొహమాటం కొద్దీ నో చెప్పలేని ఈ పాత్రతో ప్రభాస్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు.. ? అనేది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.