Prabhas: ప్రాజెక్ట్ కె, ప్రభాస్, కమల్ హాసన్.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇవే దర్శనమిస్తున్నాయి. ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న తరుణం.. ఈరోజు ఎదురు కానుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 వ సినిమా.. నాగ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కమల్ హాసన్- ప్రభాస్- అమితాబ్ బచ్చన్.. మూడు భాషల స్టార్ నటులు ఒక సినిమాలో కనిపించే అరుదైన కలయిక.. దీంతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ లుక్ ఎన్ని ట్రోల్స్ ను ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, రిలీజ్ డేట్, ఫస్ట్ గ్లింప్స్ నేడు శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్న విషయం తెల్సిందే. రెండు రోజుల క్రితమే చిత్ర బృందం మొత్తం అమెరికాలో దిగి సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ కళ్ళలో మెరుపును తీసుకొచ్చింది.
Bro: ఇక ఆగేదెలే ‘బ్రో’… ఇక హైప్ లేపుదాం పద
వింటేజ్ లుక్ లో డార్లింగ్.. ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ఉదయం నుంచి ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా కమల్ హాసన్ తో ప్రభాస్ కలిసి ఉన్న ఫోటోను మేకర్స్ అధికారికంగా పోస్ట్ చేస్తూ ” రెండు ఫోర్సెస్ కలిశాయి. అమితాబ్ బచ్చన్ సర్ ..మీరు ఎక్కడ ఉన్నా.. ఈరోజు మీరు మాతోనే ఉన్నారని అనుకుంటాం. మన ప్రముఖులందరి అద్భుతమైన ఫ్రేమ్‌ను చూడటానికి వేచి ఉండలేము” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఫ్రేమ్ లో కమల్, ప్రభాస్ నవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా కనిపించారు. ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపించినప్పుడు మిలియన్ డాలర్ పిక్ అంటారు. ఇప్పుడు ఈ పిక్ ను కూడా అభిమానులు మిలియన్ డాలర్ పిక్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ ఫస్ట్ గ్లింప్స్ లో కమల్ కూడా కనిపిస్తాడేమో చూడాలి.