Bro: ఇక ఆగేదెలే ‘బ్రో’… ఇక హైప్ లేపుదాం పద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్ పనులతో బిజీగా ఉన్నారు. అందుకే బ్రో మూవీ ప్రమోషన్స్ భారమంతా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మోస్తున్నాడు. హీరోయిన్లతో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించింన ఈ మెగా మల్టీస్టారర్ మూవీ జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ‘బ్రో’ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ ఓపెనింగ్స్ కానున్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఇక ఆగేదెలే అంటున్నారు మేకర్స్.
ఫైనల్‌గా 21న లేదా 22న బ్రో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. హైదరాబాద్.. వైజాగ్.. తిరుపతి పట్టణాల్లో ఒకేసారి బ్రో ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఇక 25న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీరిలీజ్ నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గతంలో పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సెంటిమెంట్‌తో బ్రో పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణే స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ప్రజెంట్ పవన్ రాజకీయాలతోనే సమయం గడుపుతున్నాడు కాబట్టి. అందుకే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!