విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ‘ఎఫ్ 3’ కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో అలరించబోతుంది. ఈ నెల 17న విడుదల కానున్న ‘ఎఫ్3’లోని ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. ఈ పాట ప్రోమో రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్.. పర్ఫెక్ట్ పార్టీ పోస్టర్ గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్ జిగేల్ అనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ పిట్స్ లో స్పెషల్ పార్టీ సాంగ్ కి తగ్గట్టు మెరిశారు.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పార్టీ సాంగ్ కోసం క్యాచి, గ్రూవీ నెంబర్ ని ట్యూన్ చేశారు. ఈ పార్టీ సాంగ్ సినిమాలో మూవీ స్టార్ కాస్ట్ అంతా కనిపించబోతోంది. గతవారం విడుదలైన ‘ఎఫ్ 3’ ట్రైలర్ 20 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని, గత 6 రోజులుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
After the FUN Explosion of #F3Trailer, Get Ready to Rock the floors with @hegdepooja💃🏻#LifeAnteIttaVundaala 🥳
Lyrical Song on MAY17
Promo Tomorrow@ 10:08AM🎶@ThisIsDSP@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official @adityamusic #F3Movie pic.twitter.com/Y7hGX5Mxt7
— Anil Ravipudi (@AnilRavipudi) May 15, 2022