పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. రెగ్యులర్ సాంగ్స్ మాత్రమే కాదు సిట్యూవేషనల్ సాంగ్స్, సరాదాగా పడుకునే టీజింగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. బై బయ్యె బంగారు రావణమ్మ, కిల్లి కిల్లి కిల్లి లాంటి సాంగ్స్ ని స్వయంగా పాడి పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో కూర్చున్న ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి సినిమాలో కూడా ‘కొడకా కోటేశ్వరరావు’ సాంగ్ థియేటర్ లో బాగానే పేలింది. ఆ తర్వాత పవన్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు సీరియస్ జానర్ లో తెరకెక్కాయి కాబట్టి వీటిలో స్పెషల్ సాంగ్ కి స్కోప్ లేకుండా పోయింది. ఈ లోటుని తీర్చడానికి రాబోయే రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో OG పైనున్నన్ని అంచనాలు మరో సినిమాపై లేవు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. గ్యాంగ్ స్టర్ డ్రామాకి గ్లామర్ టచ్ ఇస్తూ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌తో ఐటెం సాంగ్ చేయించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. OGలో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తుంటే… బ్రో సినిమాలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ బ్లాక్ కోసం… పవన్ వింటేజ్ ట్యూన్స్‌ని మిక్స్ చేస్తున్నాడట. ముఖ్యంగా గుడుంబా శంకర్‌లో కిళ్ళీ కిళ్ళీ అనే ఫోక్ సాంగ్ బిట్‌ను ఇందుకోసం వాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సాంగ్స్ సినిమాలో పడితే ఫాన్స్ కి వింటేజ్ వైబ్స్ రావడం గ్యారెంటీ.