పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. డీవీవీ దానయ్య ప్రొడక్షన్స్ లో రూపొందనున్న ఈ మూవీలో అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకూ పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్ అవ్వడం కష్టమే. ఈ విషయం పవన్ ఫాన్స్ కి కూడా తెలిసే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా #DVVWeWantAnirudhForOG అనే హాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమాకి అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని మెగా అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అనిరుధ్ ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తే అది హిట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. హీరోకి ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టడంలో అనిరుధ్ దిట్ట. ‘పేట’, ‘కత్తి’, ‘మారీ’, ‘విక్రమ్’ లాంటి సినిమాల్లో అనిరుధ్ అద్భుతాలు చేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో అనిరుధ్, స్టార్డమ్ ని పీక్ స్టేజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాకి, అనిరుధ్ ని తీసుకోని రావాలని అభిమానులు అడగడం #PSPK29కి కలిసొచ్చే విషయమే. అనిరుధ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక సినిమా వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకి అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ తర్వాత నాని నటించిన ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలకి కూడా అనిరుధ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాకి అనిరుధ్ ప్రాణం పోశాడు. ప్రస్తుతం అనిరుధ్ చేస్తున్న ఒకేఒక్క తెలుగు సినిమా ‘NTR30’. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం అనిరుధ్ ఇటివలే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు.