ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. వినోదయ సీతమ్ ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also: Boyapati Rapo: ‘రామ్-బోయపాటి’ పవర్ ఫుల్ టైటిల్…
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే బ్రో మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయాయి. పవర్ ఫుల్ స్టైలిష్ గాడ్‌గా కనిపించబోతున్నడు పవన్. అయితే ఈ సినిమా రిలీజ్‌కు మరో నెల రోజుల సమయమే ఉంది. అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో.. బ్రో టీజర్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో టీజర్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సాలిడ్‌గా టీజర్ కట్ చేసినట్టు టాక్. మరి ‘బ్రో’ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.