Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన విషయం విడితమే. ముఖ్యంగా ఇటీవల మంగళగిరిలో జరిగిన మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగంతో అదరకొట్టారు. ఎప్పుడు లేనంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు కూడా మాట్లాడారు. అంతేకాకుండా చెప్పు చూపుతూ వైసీపీకి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. మూడు పెళ్లిళ్లు ఆయ్యాయి అని అంటున్నారు.. మీరు కూడా చేసుకోండి మూడు పెళ్లిళ్లు.. ఇద్దరికి కుదరలేదు.. విడాకులిచ్చాను.. మొదటి భార్యకు రూ. 5కోట్లు ఇచ్చాను.. రెండో భార్యకు మిగిలిన ఆస్తి మొత్తం రాసిచ్చాను అని చెప్పారు. అయితే తన భరణంపై రేణు దేశాయ్ గతంలో మాట్లాడిన మాటలను మరోసారి తవ్వుతున్నారు ట్రోలర్స్. పవన్ తో రేణు విడిపోయినప్పటి నుంచి ఆమె భరణంపై ఒకటే మాటను అంటూ వస్తోంది. చాలా ఇంటర్వ్యూలలో ఆమె నిర్మొహమాటంగా పవన్ వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చింది.
“పవన్ కళ్యాణ్ నుంచి నేను చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు.. ఇద్దరు పిల్లలను తీసుకొని బయటికి వచ్చాను. నా వ్యక్తిత్వం అటువంటిది.” అని చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్.. రేణుకు అకీరాకు ఒక పెద్ద బంగ్లా గిఫ్ట్ గా ఇచ్చారంటూ వచ్చిన వార్తలను కూడా రేణు ఖండించింది. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం.. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ… ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం… ఇది మీకు తెలియనిదా? అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ వార్తలు రాసినవారు ఒక తల్లికే పుట్టారు అనుకుంటాను.. ఇంకో తల్లిని ఇలా బాధపెట్టకూడదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ పాత పోస్ట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్న పవన్ .. చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అన్న రేణు.. వీరిలో ఎవరి మాట నిజం అని అభిమానులు తల పట్టుకుంటున్నారు. పవన్ చెప్పింది వాస్తవం అయితే.. ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ఈ విషయం బయటపడుతోంది. ఇప్పటివరకు ఆమెకు డబ్బులు కానీ, ఆస్తి కానీ ఇచ్చినట్లు ఎక్కడా దాఖలాలు కూడా లేవు. మరి పవన్ ఈ విషయాన్నీ ఎందుకు చెప్పాడు. ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ విషయాన్నీ రేణు ఎందుకు ఒప్పుకోవడం లేదు అనేది తెలియాల్సి ఉంది.