Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి గ్రేస్ గురించి తెలుగు ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏజ్ లో కూడా చాలా ఈజ్ గా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న హీరో మెగాస్టార్. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారజా రవితేజ కీలక పాత్రలో నటిస్తుండగా.. చిరు సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి.
సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు. ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బాస్ పార్టీ అనే సాంగ్ ను ఈనెల 13న సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాటని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పోస్టర్ లో చిరంజీవిని చూస్తుంటే ముఠా మేస్త్రి గుర్తుకురాకుండా మానదు. మల్టీకలర్ లుంగీ, టీ షర్ట్, దానిపై చొక్కా, బ్లాక్ షూస్, నోట్లో బీడీ.. టోటల్ గా ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. చిరును ఈ లుక్ లో చుసిన అభిమానులు వింటేజ్ చిరు అంటూ చెప్పుకొస్తున్నారు. బాస్ పార్టీ లో ఊర్వశి రౌతేలా అందాలు హైలైట్ గా మారనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సాంగ్ లో చిరు మాస్ స్టెప్స్ వింటేజ్ చిరును గుర్తుచేస్తాయో లేదో చూడాలి.