Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో సినిమా మరో స్టార్ హీరో చేయడం సాధారణమే. ఒకహీరోకు నచ్చిన కథ.. మరో హీరోకు నచ్చదు. ఇలా కాకుండా మరెన్నో కారణాలు ఉంటాయి. ఇక తాజాగా ఒక పెద్ద ప్రాజెక్ట్.. మహేష్ బాబు చేతి నుంచి పవన్ వరకు వచ్చిందంట. అదే.. ‘దే కాల్ హిమ్ ఓజి’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహూ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకినాయి. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకొని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇండస్ట్రీలో డైరెక్టర్ సుజీత్ గురించే చర్చ సాగుతోంది. మూడో సినిమానే పవన్ తను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. రన్ రాజా రన్ సినిమాహాతో హిట్ అందుకున్న ఈ కుర్ర డైరెక్టర్ రెండో సినిమాగా ప్రభాస్ తో సాహో తీసాడు. ఈ సినిమా విజయాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, సుజీత్ పనితనాన్ని అయితే ప్రేక్షకులు గుర్తించారు.
Rangamarthanda: రాజశేఖర్ కూతురితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?
సాహూ తరువాత సుజీత్ నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఈ నాలుగేళ్లలో తాను రాసుకున్న కథను సూపర్ స్టార్ మహేష్ బాబు కు వినిపించాడట. అయితే ఆయన ఈ కథను రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక అదే కథను గతేడాది పవన్ కు వినిపించడం, పవన్ ఓకే అనడం చకచకా జరిగిపోయాయి. అసలు మహేష్ ఈ కథకు ఎందుకు నచ్చలేదు.. సాంగ్స్, ఫైట్స్ లేకపోవడం వలన.. ఇదే పవన్ కు నచ్చిందా..? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆయన రిజెక్ట్ చేస్తే ఈయనకు చెప్పిన సుజీత్.. మరి ఈయనకు హిట్ ఇస్తాడా..? లేక మహేష్ రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అనే మాటను అనిపిస్తాడా..? అనేది చూడాలి.