Rangamarthanda: చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ.. రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తుండగా.. కుర్ర జంటగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు కృష్ణవంశీ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలో పెళ్లి సీన్ కు సంబంధించిన స్టిల్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టిల్స్ చూస్తుంటే నిన్నే పెళ్లాడతా కుటుంబం గుర్తుకు రాకమానదు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వరుడిగా.. శివాత్మిక వధువుగా ఎంతో ముద్దుగా కనిపించగా.. కుటుంబ పెద్దలుగా ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. వధూవరులకు అన్న వదినలుగా అనసూయ, ఆదర్శ్.. ఇక కుటుంబానికి పెద్దగా బ్రహ్మానందం ఉన్నట్లు కనిపించారు.
Thalapathy67: ‘మాస్టర్’ కోసం అధీరా ను దింపేసిన లోకేష్
ప్రకాష్ రాజ్ ఒడిలో పెళ్లి కూతురుగా మారిన శివాత్మిక కూర్చోగా.. మిగతావారందరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటుంది. ఈ సినియూమకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.. కానీ, ఈ ఏడాది మాత్రం కచ్చితంగా రంగమార్తాండ ఎంట్రీ ఉండనుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో కృష్ణవంశీ మునుపటి రేంజ్ ను అందుకుంటాడో లేదో చూడాలి.