పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమా వైబ్స్ ఇస్తూ చేస్తున్న సినిమా ‘OG’. సాహో సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా చిన్న మాట అవుతుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం, OG గ్యాంగ్ స్టర్ డ్రామా అవ్వడంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా OG మూవీకి ఇచ్చినన్ని డేట్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఇవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో ఇప్పటికే OG మూవీని 60% షూటింగ్ కంప్లీట్ చేసారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ఈ రేంజ్ హైప్ మైంటైన్ చేస్తున్న ఏకైక సినిమా OG మాత్రమే.
ఓజి అంటే అందరు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనుకుంటున్నారు కానీ ఓజి అంటే ‘ఓజస్ గంభీర’ అని తెలుస్తోంది. దాన్నే షార్ట్‌గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా మార్చారని సమాచారం. అయితే ‘ఓజస్ గంభీర’ అనేది.. సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు అని అంటున్నారు. ‘దే కాల్ హిమ్ OG’ అనే టైటిల్ ని సుజిత్ అండ్ టీం లాక్ చేసారని సమాచారం. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున సెప్టెంబర్ 2న టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో, సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో, పవన్ కళ్యాణ్ OG స్క్రీన్ ప్రెజెన్స్ తో బయటకి రానున్న ఈ టీజర్ టాలీవుడ్ లో ది బెస్ట్ టీజర్ కట్ గా పేరు తెచ్చుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 72 సెకెండ్ల పాటు OG టీజర్ ఉండనుందని, పవన్ కళ్యాణ్ ని సుజిత్ పీక్ స్టేజ్ లో ఎలివేట్ చేసాడని ఇన్సైడ్ టాక్. మరి ప్రస్తుతం OG సినిమాపై ఉన్న అంచనాలని బట్టి చూస్తే సోషల్ మీడియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ OG టీజర్ బయటకి రాగానే చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.