యావత్ సినిమా అభిమానులందరూ ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్, రామ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కి వరం రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు ఆర్ఆర్ఆర్ త్రయం. ఒక పక్క దేశ వ్యాప్తంగా ప్రెస్ మీట్లను పెట్టుకుంటూ వెళ్తున్న ఈ బృందం మధ్యలో స్టార్ లతో జరిపిన ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ సినిమా విషయాలతో పాటు ఆసక్తికరమైన విషయాలను పంచుకొని అభిమానులను అలరిస్తున్నారు. మొన్నటికి మొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ త్రయాన్ని ఇంటర్వ్యూ చేయడం ఇంట్రెస్టింగా మారగా.. తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి హోస్ట్ గా మారిపోయి రామ్ చరణ్, తారక్ ని ఇంటర్వ్యూ చేయడం ఆసక్తి రేపుతోంది.
ఇక ఈ ఇంటర్వ్యూలో కీరవాణి.. ఇద్దరు హీరోలను తికమక ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టడం.. వాటికి తెలివిగా తారక్, చెర్రీ సమాధానాలు చెప్పడం ఆకట్టుకుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తారక్, యాంకర్ సుమపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మీ సినిమాలో సుమకు ఏ పాత్ర ఇస్తే బావుంటుంది అని మీరనుకుంటున్నారు అని కీరవాణి అడగగా తారక్ సమాధానమిస్తూ ” మా సినిమాలో అయితే అమ్మమ్మ, నాయనమ్మ లాంటి ముసలమ్మ పాత్ర ఇవ్వాలి. మేకు ఛాదస్తం ఎక్కువ.. నోరు వేసుకొని పడిపోతుంది. ఆమెను చూడగానే గయ్యాళి అత్తగారి పాత్ర గుర్తొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం చెప్తూ ” సుమ కు పంచాయితీలను సెటిల్ చేసే పాత్ర ఇస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.