Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పాలిటిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. లంకల రత్న అనే మాస్ పాత్రలో విశ్వక్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రరిలీజైన సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పోటీగా మరో మూడు సినిమాలో లైన్లో ఉన్నాయి. దీంతో తమ సినిమాను ఎప్పటికప్పుడు హైప్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే.. తెలుగు హీరోలు.. బాలీవుడ్ భామల ఐటెం సాంగ్. ఎప్పటినుంచో ఈ ట్రెండ్ నడుస్తుండగా.. ఈ మధ్య బాలీవుడ్ నుంచి ఊర్వశి రౌతేలా మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది.
ఇక ఇప్పుడు మనోహరీ భామ ఛాన్స్ పట్టేసింది. బాహుబలి సినిమాలో మనోహరీ అంటూ ప్రభాస్ తో ఆడిపాడిన బ్యూటీ నోరా ఫతేహి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఐటెం సాంగ్ చేయనుందని సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఒక ఊర మాస్ సాంగ్ కు అమ్మడు.. విశ్వక్ తో కలిసి చిందులు వేయనుందని టాక్ నడుస్తోంది. నోరా.. ఈ సినిమాలో జాయిన్ అయితే దీనికి వచ్చే హైప్ వేరేలా ఉంటుంది. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా కొనసాగుతున్న ఆమె.. ఈ సినిమాలో చేయడం విశేషమనే చెప్పాలి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.