మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు కొణిదెల కళ్యాణ్ బాబు

27 ఏళ్ళ క్రితం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు

1996లో ఈ సినిమా రిలీజ్ తరువాత నుంచి పవన్ కళ్యాణ్ గా మారాడు 

సుస్వాగ‌తం, తొలి ప్రేమ‌, బ‌ద్రి, ఖుషి సినిమాలతో పవన్ కళ్యాణ్ ముందు పవర్ స్టార్ వచ్చి చేరింది 

పవన్ కు ఉన్న  ఫ్యాన్ బేస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది

గెలుపు, ఓట‌ములు, స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతూనే ఉన్నాడు

ఈ 27 ఏళ్లలో పవన్ చేసినవి కేవలం 30 సినిమాలు మాత్రమే 

గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాయి

ఇక సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి దిగి జనసేన పార్టీని స్థాపించాడు పవన్

ప్రస్తుతం ఒక పక్క రాజకీయాల్లో ఉంటూనే.. ఇంకోపక్క సినిమాలు చేస్తున్నాడు

ప్ర‌స్తుతం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రాల‌లో నటిస్తున్నాడు 

పవన్ ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అవుతున్న సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు