అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడాకులు తరువాత కూడా స్నేహితులుగానే ఉంటామని చెప్పిన ఈ జంట ఇప్పటివరకు ఒక్కసారిగా కలిసినట్లు గానీ, మాట్లాడుకున్నట్లు కానీ సమాచారమే లేదు. అయితే వీరి విడాకుల వలన ఎవరు ఎంత నష్టపోయారు అనేది తెలియదు కానీ టాలీవుడ్ లో ఒక లేడీ డైరెక్టర్ మాత్రం తీవ్ర నష్టపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ లేడీ డైరెక్టర్ ఎవరో కాదు నందినీ రెడ్డి. సామ్ కి ‘ఓ బేబీ’ చిత్రంతో మంచి హిట్ ఇచ్చిన ఈ లేడీ డైరెక్టర్ ప్రస్తుతం సందిగ్ద పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకు అంటే.. విడాకులకు ముందే ఈ జంటతో నందినీ రెడ్డి ఒక సినిమా తీయాలని ప్లాన్ వేశారు.
ఓ బేబీ తరువాత ఈ కథ పట్టాలెక్కించాలని చూశారు. అయితే తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచినట్లు వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో ఇప్పుడు నందినీ రెడ్డికి ఇద్దరిలో ఒక్కరు కూడా చిక్కడం లేదట. ప్రస్తుతం సామ్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇటు పక్క చై సైతం ‘థాంక్యూ’, హర్రర్ వెబ్ సిరీస్ తో బిజీగా మారాడు. డైరెక్టర్ పరశురామ్ ఈ హర్రర్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘సర్కారు వారి పాట’ ని పూర్తి చేసి దాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. దీంతో ఈ జంట నందినీ కి డేట్స్ కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఈ జంటతో మంచి సినిమాను తీద్దామనుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు ఇద్దరిలో ఒక్కరు కూడా ఖాళీగా లేకపోవడంతో డైలమాలో పడినట్లు టాలీవుడ్ టాక్. అయితే కొన్నిరోజులు ఆలోచించిన ఈ దర్శకురాలు ఏది అయితే అది అయిందని మరో కొత్త జంటను వెతికి సినిమా మొదలుపెట్టిందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏదిఏమైనా సామ్- చై విడాకుల వలన నందినీ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.