సంక్రాంతికి థియేటర్స్ లో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్ దగ్గరే కాదు పండగ వాతావరణం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది అంటోంది ‘నెట్ ఫ్లిక్స్’. ఒటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్, ఇండియన్ సినిమాలపైన మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపైన దృష్టిపెట్టింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ చాలా సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నాగ శౌర్య నటిస్తున్న కొత్త సినిమా, 18 పేజస్, మీటర్, కార్తికేయ న్యూ మూవీ, రవితేజ ధమాకా, నాని దసరా, అర్జున్ దాస్ నటించిన బుట్టబొమ్మ, కళ్యాణ్ రామ్ అమిగోస్, చిరు భోలా శంకర్, సందీప్ కిషన్ బడ్డీ సినిమాల రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతిలో ఉన్నాయి. ఈ సినిమాల థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వగానే ఒటీటీలో స్ట్రీమ్ అవ్వనున్నాయి. ఇందులో నాని నటించిన దసరా, చిరు నటించిన భోలా శంకర్ సినిమాలు ఓవర్సీస్ ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
రవితేజ రీసెంట్ హిట్ మూవీ ‘ధమాకా’ సినిమా జనవరి 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. థియేటర్స్ ఇంకా రన్ అవుతున్న ధమాకా సినిమాని ఒటీటీలో చూడడానికి సినీ అభిమానులు రెడీగా ఉన్నారు. ధమాకా రిలీజ్ రోజే ప్రేక్షకుల ముందుకి వచ్చిన 18 పేజస్ సినిమా కూడా త్వరలోనే స్ట్రీమ్ అవ్వనుంది. ఆహా, అమెజాన్ లకి గట్టి పోటీ ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ సౌత్ సినిమాల కంటెంట్ పై దృష్టి పెట్టినట్లు ఉంది. ప్రస్తుతం ఈ సినిమాల అనౌన్స్మెంట్ తో #netflixsouth #netflixpandaga ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నెట్ ఫ్లిక్స్ సౌత్ అనౌన్స్ చేసిన ఈ సినిమాలు ఏ డేట్ కి రిలీజ్ అవుతాయి అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Also: Varun Sandesh: షూటింగ్ పూర్తి చేసుకున్న వరుణ్ సందేశ్ కొత్త సినిమా…