హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తన ఇమేజ్ ని మార్చుకునే పనిలో పడినట్లు ఉన్నాడు. ఇటివలే ‘ఇందువదన’ సినిమాలో కంప్లీట్ కొత్తగా కనిపించిన వరుణ్ సందేశ్, ఈసారి ‘యద్భావం తద్భవతి’ సినిమాతో కొత్తగా కనిపించడానికి రెడీ అయ్యాడు. యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వరుణ్ సందేశ్ బర్త్ డే సంధర్భంగా జూలై 21న ‘యద్భావం తద్భవతి’ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు, ఇందులో వరుణ్ కంప్లీట్ న్యూ మేకోవర్ లో కనిపించాడు. క్లాస్ నుంచి మాస్ జోనర్ లో షిఫ్ట్ అయ్యి వరుణ్ సందేశ్ నటిస్తున్న ఈ మూవీలో బిగ్ బాస్ ఫేమ్ ‘ఇనాయ సుల్తానా’, తెలుగు అమ్మాయి రేణు శ్రీలు హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ధనరాజ్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీని రమేష్ జక్కల డైరెక్ట్ చేస్తుండగా, ప్రసన్న లక్ష్మీ భూమి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Read Also: Tollywood: బాలయ్య కంటే వీరయ్యకే ఎక్కువ స్క్రీన్‌లు.. సంక్రాంతి విన్నర్ అతడేనా?
వరుణ్ సందేశ్ కంబ్యాక్ మూవీ అయ్యే అవకాశం ఉన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా వరుణ్ సందేశ్, ధనరాజ్, రేణుశ్రీల పైన షూట్ చేసిన పబ్ సాంగ్ తో ‘యద్భావం తద్భవతి’ షూటింగ్ పార్ట్ ముగిసింది. మ్యూజిక్ డైరెక్టర్ మిహిరాన్ష్ కంపోజ్ చేసిన ‘జింగిచకా జింగిచకా సురాపానము’ అనే క్యాచీ సాంగ్ ని ‘జేడీ’ మాస్టర్ ఖోరియోగ్రఫీ చేశాడు. ఈ మూవీని మార్చ్ నెలలో ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి… త్వరలోనే జింగిచకా జింగిచకా సురాపానము సాంగ్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టే అవకాశం ఉంది.