Neru Trailer: దృశ్యం సినిమా .. ప్రేక్షకులు అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఒక చదువురాని వ్యక్తి తన సినిమా తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక హత్యను చేయలేదని ప్రపంచాన్ని మొత్తం నమ్మిస్తాడు. అసలు ఆ సినిమాలో ఉండే ట్విస్ట్ లు, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జీతూ జోసెఫ్. కోర్టు డ్రామాలు తీయడంలో జీతూ ఎక్స్పర్ట్. ఇప్పుడు దృశ్యం లానే ఈ డైరెక్టర్ మరో కోర్టు డ్రామాను తెరకెక్కించాడు. అదే నేరు. మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద సలార్, డంకీ చిత్రాలు ఉన్నప్పటికీ.. మలయాళంలో ఈ సినిమా డామినేట్ చేసి.. సూపర్ హిట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ ఉంటుందో లేదో అని అభిమానులు భయపడ్డారు. కానీ, ఆ భయం లేకుండా అన్ని భాషల్లో జనవరి 23 న నేరు స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు.
తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మోహన్ లాల్ కొన్ని కారణాల వలన లాయర్ ప్రాక్టీస్ ను మానేస్తారు. అయితే ఒక కేసుకోసం ఆయన చాలా కాలం తరువాత నల్లకోటు వేసుకుంటాడు. కానీ, ప్రాక్టీస్ లేకపోవడంతో కోర్టు లో విచారణకు వచ్చినవారిని సరైన ప్రశ్నలు అడగలేకపోతాడు. ఇక మోహన్ లాల్ కు వ్యతిరేకంగా ప్రియమణి వాదిస్తూ ఉంటుంది. అసలు ఈ కథలో నిందితులు ఎవరు.. ? బాధింపబడినవారు ఎవరు అనేది ట్రైలర్ లో చూపించకపోవడంతో దీనిగురించి ఈ కథ నడుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి న్యాయం కోసం నిలబడే మోహన్ లాల్.. ఎందుకు ప్రాక్టీస్ ను ఆపేశాడు.. ? ఈ కేసులో ఎవరు గెలుస్తారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమాలో ఈసారి ఎవరు బలి అవుతారో..? చూడాలి.