Nayanthara Vignesh Shivan Lands In Surrogacy Controversy: సరోగసీ (అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనడం) విధానం ద్వారా తాము కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యామని నయనతార, విఘ్నేష్ శివన్ రీసెంట్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే! అంతేకాదు.. తమ కుమారులకు ఉయిర్, ఉలగమ్ అనే పేర్లు కూడా పెట్టినట్టు పేర్కొన్నారు. కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో ఉజ్వలంగా, మనోహరంగా ఉందని.. తమ ప్రార్థనలు, పూర్వీకుల దీవెనలతో తమకు అంతా మంచే జరిగిందంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఇదే సమయంలో మన దేశంలో సరోగసీని నిషేధించారంటూ సీనియర్ నటి కస్తూరి ఓ ట్వీట్ చేసింది. అది వైరల్‌గా మారడం, దానిపై రకరకాల చర్చలు జరిగిన నేపథ్యంలో.. నయనతార కవల పిల్లల వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది.
సరోగసీపై వివరాలను అందజేయాలని.. నయనతార, విఘ్నేష్ శివన్‌కు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్ నోటీసులు పంపారు. నిబంధనలకు అనుగుణంగానే సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి, దీనికి వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నిజానికి.. మన దేశంలో సరోగసీ అనేది చట్టరీత్యా నేరం. గర్భం దాల్చలేని సందర్భంలో తప్ప.. అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడమనేది నేరం. ఈ ఏడాది జనవరి నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే కస్తూరి చేసిన ట్వీట్ వైరల్ అవ్వడం, నెటిజన్లు సైతం ఫైర్ అవ్వడంతో.. తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిగా నయన్ దంపతులకు నోటీసులు పంపడం జరిగింది. పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాల్సిందేనని వివరణ కోరింది.