Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తల్లిగా మాతృత్వపు మధురిమలను అనుభవిస్తుంది. ప్రేమించిన విగ్నేష్ శివన్ ను వివాహమాడి .. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాలను వదలకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. ఇక సినిమాలు కాకుండా నయన్ ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా నిర్మించింది. రౌడీ పిక్చర్స్ పేరుతో ఈ ప్రొడక్షన్ హౌస్ లో మంచి సినిమాలను నిర్మిస్తుంది. ఇంకోపక్క లిప్ స్టిక్ బిజినెస్ కూడా చేస్తోంది. ఇవి కాకుండా తాజాగా మరో బిజినెస్ లోకి నయన్ అడుగుపెట్టిందని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం నయన్- విగ్నేష్ దంపతులు.. చెన్నైలోని మూత పడ్డ సింగిల్ స్క్రీన్ థియేటర్ అగస్త్య ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు మల్టీఫ్లెక్స్ బిజినెస్ లో హీరోలు మాత్రమే ఉన్నారు.
Anasuya: బికినీలో అనసూయ.. పిల్లల ముందు ఏంటీ ఈ చండాలం
మొట్ట మొదటిసారి హీరోయిన్ నయన్.. ఆ రికార్డును అందుకుంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ అగస్త్య ను నయన్.. మల్టీప్లెక్స్ గా తీర్చిద్దనున్నదట. NV మల్టీప్లెక్స్ పేరుతో చెన్నైలోనే అత్యంత విలాసవంతమైన మల్టీ ప్లెక్స్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారట. అత్యాధుని హంగులతో ప్రజలు మెచ్చేలా థియేటర్ ను రెడీ చేస్తున్నారట. ఇక తెలుగులో ఇప్పటివరకు మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. లాంటి స్టార్ హీరోస్ మాత్రమే మల్టిఫ్లెక్స్ లోకి దిగారు. మరి వారిలానే నయన్ కూడా ఈ బిజినెస్ లో విజయం అందుకుంటుందోలేదో చూడాలి.