Narne Nithin: నందమూరి.. ఇది ఇంటిపేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. నందమూరి తారక రామారావు క్రియేట్ చేసిన ఒక ల్యాండ్ మార్క్. ఇక ఈ పునాదిని బేస్ చేసుకొని వచ్చిన హీరోలు ఎంతోమంది. అందులో కొందరు ముందు ఉన్నారు. మరికొందరు వెనుక ఉన్నారు. ఇక నందమూరి హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా నందమూరి లెగెసీని ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పునాదిగా మారాడు. ఆయన పేరును బేస్ చేసుకొని ఆయన బావమరిది హీరోగా మారనున్నాడు. అవును.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ కుర్రాడు హీరోగా ఒక సినిమా మొదలు అయ్యింది. షూటింగ్ కూడా ఫినిష్ చేసుకుందని టాక్.
Gandeevadhari Arjuna Pre-Teaser: పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన మెగా ప్రిన్స్
శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే టైటిల్ తో మొదలైన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నా కూడా ఈ సినిమా రిలీజ్ కు మోక్షం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే నితిన్.. వెళ్లి వెళ్లి గీతా ఆర్ట్స్ బుట్టలో పడ్డాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో నిజం ఎంత ఉందో అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాలని చెప్పుకొచ్చారు. కాగా, అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అంట. జూలై 13 న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నది. ఇకపోతే ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తుందని సమాచారం. అయితే డైరెక్టర్ ను మాత్రం మేకర్స్ పూజా కార్యక్రమం రోజునే పరిచయం చేయనున్నారట. ఇక నో కన్ఫ్యూజన్.. అల్లు అరవింద్ చేతిలో ఎన్టీఆర్ బావమరిది పడ్డాడంటే.. మనోడి కెరీర్ కు ఎటువంటి డోకా లేదని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి బావ లానే నితిన్ కూడా హిట్ హీరో అనిపించుకుంటాడా.. ? లేదా..? అనేది చూడాలి.