Narayana & Co: యువ కథానాయకుడు సుధాకర్ కొమాకుల నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ ‘నారాయణ అండ్ కో’ లోని మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘దండక డన్ డన్’ అంటూ సాగే ఇది ఫుల్ పైసా వసూల్ సాంగ్. నాగవంశీ ఈ పాటను క్యాచీ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశాడు. రాహుల్ సిప్లిగంజ్ ఫుల్ ఎనర్జిటిక్ గా దీన్ని పాడాడు. ఈ పాటను పూర్ణ చారి రాశారు. లాటరీ తగిలిన ఆనందంలో ‘నారాయణ అండ్ కో’ కింగ్స్ లా ఫీలవుతూ రాజుల వస్త్రాధారణలో హంగామా చేయడం ఆకట్టుకుంది. ఈ పాటలో సుధాకర్ కొమాకులతో పాటు దేవి ప్రసాద్, ఆమని, దాదాపు ‘నారాయణ అండ్ కో’ అంతా సందడి చేసింది.
సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగవంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్. రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్ , శరద్ గుమాస్టే అసోసియేట్ ప్రొడ్యూసర్. అతి త్వరలోనే ఈ సినిమా జనం ముందుకు రానుంది.