‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ సినిమాతో ఆమని గారికి జాతీయ అవార్డు రావాలని టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో మురళీ మోహన్ ఆకాంక్షించారు. ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మాతగా, టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తిక్ కోడకండ్ల సంగీత దర్శకుడిగా, ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల…
Amani: తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. ఆమనీ. ఆమె నటిస్తే జీవించినట్లే ఉంటుంది. పక్కింటి అమ్మాయిగా.. గయ్యాళి కోడలిగా.. అనుమానపు భార్యగా నటించడం అంటే ఆమె తరువాతనే ఎవరైనా. శుభలగ్నం, శుభ సంకల్పం, మావి చిగురు వంటి సినిమాల్లో ఆమె నటనను మర్చిపోవడం ఎవరి వలన కాదు.
వర్థమాన కథానాయకుడు విశ్వ కార్తికేయ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. అతను నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'అల్లంత దూరాన...' సినిమాతో పాటే క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' కూడా ఈ నెల 10న జనం ముందుకు వస్తోంది.
Amani: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలందరితోను నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు.
నటి ఆమని ఇప్పుడంటే అమ్మ పాత్రలు పోషిస్తోంది కానీ ఇరవై ఐదేళ్ళ క్రితం అందాల నాయికగా, అభినయ తారగా రాణించింది. మరీ ముఖ్యంగా కె. విశ్వనాథ్, బాపు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించి, తన అభినయంతో ఆకట్టుకుంది. జీ తెలుగు ఛానెల్ లో జరుగుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ కు ఇటీవల ఆమని గెస్ట్ గా హాజరైంది. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది.…