బాలయ్య సినిమా వస్తుంది అంటే ఓవర్సీస్ ఫాన్స్ చేసే హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు బాలయ్య సినిమా అనగానే సీడెడ్ లో ఫాన్స్ థియేటర్స్ దగ్గర ఎంత రచ్చ చేసారు, ఎలాంటి సంబరాలు చేసారు అని మాట్లాడుకునే వాళ్లు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఓవర్సీస్ బాలయ్య ఫాన్స్ వచ్చారు. అఖండ సినిమా టైములో బాలయ్య ఫాన్స్ అమెరికాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది అమెరికానా లేక మా సీమనా అనే డౌట్ వచ్చే రేంజులో అఖండ సినిమా రిలీజ్ టైం లో కార్ ర్యాలీలు, ఫ్లైట్ బ్యానర్ లు, ఫ్యాన్ మీటింగ్స్… అబ్బో అది మాములు సెలబ్రేషన్ కాదులే. ఒక సీనియర్ హీరో సినిమాకి ఓవర్సీస్ లో ఆ రేంజ్ సెలబ్రేషన్ చూడడం ఇదే మొదటిసారి. అఖండ హిస్టరీని రిపీట్ చేస్తూ వీరసింహ రెడ్డి సినిమాకి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసారు. మరోసారి బాలయ్య ఫాన్స్ తమ రేంజ్ ఏంటో చూపించే సమయం వచ్చింది.
జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా… ఇండస్ట్రీ హిట్ మూవీ ‘నరసింహ నాయుడు’ రీరిలీజ్ అవుతోంది. బాలయ్య ఫిల్మోగ్రఫీలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే కమర్షియల్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా నిలిచింది ‘నరసింహ నాయుడు’. ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమా ఎలా ఉంటుందో నరసింహ నాయుడు సినిమా చూపించింది. అలాంటి సినిమా రీరిలీజ్ అవుతోంది అంటే ఫాన్స్ లో హంగామా మాములుగా ఉండదు. జూన్ 10న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కానున్న ఈ మూవీ ఓవర్సీస్ లో జూన్ 9న రీరిలీజ్ కానుంది. మరి అఖండ, వీరసింహ రెడ్డి రేంజ్ సెలబ్రేషన్స్ రీరిలీజ్ సినిమాకి కూడా చూపిస్తారా? బాలయ్య బర్త్ కి గ్రాండ్ టేకాఫ్ ఇస్తారా అనేది చూడాలి.