Prathinidhi 2 Sneak peak Released: నారా రోహిత్ హీరోగా సినిమా తెరకెక్కనున్నట్లు ఈ మధ్యకాలంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో నారా రోహిత్ కి మంచి హిట్ గా నిలిచిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి 2 పేరుతో ఒక సినిమా అనౌన్స్మెంట్ కొద్ది రోజుల క్రితం వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. ఇక స్నీక్ పీక్ రిలీజ్ చేయగా ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, నిర్మాత అలాగే ఇతర వివరాలను కూడా నారా రోహిత్ వెల్లడించారు. జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాతో డైరెక్టర్ గా మారుతున్నట్టు వెల్లడించిన రోహిత్ సినిమాకు ఆయన మంచి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడని షూటింగ్ చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూ స్తున్నానని చెప్పుకొచ్చాడు. 2024 జనవరి 25వ తేదీన సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ నారా రోహిత్ ప్రకటించారు.
Samuthirakani: ‘బ్రో’ సినిమా చేయడానికి 73 ఏళ్ళ పెద్దాయన కారణం.. ఎలానో తెలుసా?
ఇక ఈ స్నీక్ పీక్ లో పేపర్ తో చేసిన ఒక వ్యక్తి విక్టరీ సింబల్ చూపుతున్నట్లుగా చూపించారు. నారా రోహిత్ ఫస్ట్ లుక్ గా దీని అభివర్ణించవచ్చు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి టీఎస్ ఆంజనేయులు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. నిజానికి నారా రోహిత్ నారా చంద్రబాబు నాయుడు సోదరుడు కుమారుడు కావడంతో ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన మద్దతుగానే ఉండేవారు. ఆయన చేస్తున్న సినిమాలు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అనగానే ఆయన ముందుండి ప్రచారం కూడా చేస్తూ ఉండేవారు. ఈసారి 2024 ఎన్నికలకు ముందు పార్టీకి పనికొచ్చే విధంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.