Samuthirakani about how bro movie started: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించగా జీ స్టూడియోస్ సంస్థ సినిమాను సమర్పిస్తోంది. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి విలేకర్లతో ముచ్చటించిన దర్శకుడు సముద్రఖని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాకి కారణం ఒక పెద్దాయన అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికి వినోదయ సిత్తం విడుదలై పది రోజులే అవుతుందని, ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి, నా ఫోన్ నెంబర్ సంపాదించి మరీ నాతో మాట్లాడారని అన్నారు. అంతలా మనుషులను ప్రభావితం చేసే సినిమా ఇది అని అన్నారు. ఆయన కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న త్రివిక్రమ్ విని సినిమా చేద్దామని అన్నారని చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ అన్నయ్య సహకారంతో ఇక్కడ ఈ సినిమా చేయగలిగానని, నేను సినిమా కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ సంభాషణలు ఆయనకు బాగా నచ్చాయని అన్నారు.
Viral Video: జేబులో ఫోన్ కొట్టేస్తే వీడియో చూసే దాకా తెలియలేదు.. జాగ్రత్త బాసూ!
తమిళ్ లో చేసినప్పుడు కోవిడ్ సమయం కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నటించానని చెప్పడంతో ఈ కథని ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని, కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారని, అలా కళ్యాణ్ గారికి కథ నచ్చడంతో వెంటనే సినిమా పని మొదలైందని అన్నారు.. కాలమే త్రివిక్రమ్ గారిని, కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చిందని పేర్కొన్న ఆయన ఈ కథని అన్ని భాషలకు చేరువ చేయాలని అన్నారు. 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. వినోదయ సిత్తం చేయకముందు, తర్వాత ఏంటి అనే దానిపై స్పష్టత లేదు వినోదయ సిత్తం చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగిందని అన్నారు. ఇక ఇప్పుడు బ్రో చేశాక ఇంతకంటే సాధించడానికి ఏంలేదని ఆయన కామెంట్ చేశారు.