Nani Odela 2 Alert Note for Leaks: నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని నాని ఓదెల 2 అని సంబోధిస్తున్నారు. ఈ సినిమాని కూడా దసరా సినిమాని నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా గురించి అనేక ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఒక అలర్ట్ నోట్ రిలీజ్ చేసింది. ఏ సినిమా అయినా వందల మంది కల అని మిలియన్ల మందికి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఆ కల కంటూ ఉంటారని రాసుకొచ్చారు. ఐడియా మొదలైనప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ అన్నీ కూడా కష్టంతో కూడుకున్నవని పేర్కొన్నారు. మేము ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మలుస్తూ వస్తున్నాం, మీకు ఏదైనా బెస్ట్ ఇవ్వాలనేదే మా తాపత్రయం.
బిగ్ బాస్ తెలుగు 8 రెమ్యూనరేషన్లు లీక్.. అత్యధికం-అత్యల్పం ఎవరెవరికంటే?
ఏదైనా సినిమా గురించి అనౌన్స్మెంట్ కానీ అప్డేట్ కానీ ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయడానికి అయినా మేము ఎంతో ఆలోచిస్తాం. నాని ఓదెల 2 కూడా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. ఇది మాకు సంబంధించి చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, ఇండియన్ సినిమాలో ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్లలో ఒకటి. అయితే సినిమా గురించి పుకార్లు మొదలయ్యాయి, కొన్ని లీక్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఎంతో కష్టపడుతున్న మాకు ఈ లీక్స్ చూసి చాలా బాధ కలుగుతుంది. మేము బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా ఉండమని కోరుతున్నాం. లీక్స్ చేయవద్దు ప్రేక్షకుల ఎంజాయ్మెంట్ ని కిల్ చేసే అలాంటి పనులు చేయవద్దు అని టీం అలర్ట్ నోట్లో రాసుకొచ్చింది. ఇక సినిమా గురించి అనధికార వార్తలు అన్నీ నిజం కాదని ఏ అప్డేట్ ఉన్నా తమ అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చింది.